Kathmand Conference: వరంగల్ శానిటేషన్ విధానంపై మేయర్ ప్రజంటేషన్
సౌత్ ఏషియా రీజనల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మేయర్ గుండు సుధారాణి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అంతర్-మునిసిపల్ కోఆపరేషన్ ఫర్ రెసిలెంట్ అండ్ సస్టైనబుల్ సిటీస్" అనే అంశంతో పాటు "ఎగ్జిక్యూటివ్ బ్యూరో మీటింగ్ " లో భాగంగా సౌత్ ఏషియా రీజనల్ కాన్ఫరెన్స్ లో నగర మేయర్ గుండు సుధారాణి ప్రసంగించారు. నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన సదస్సులో దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలికి చెందిన(సార్క్) దేశాలైన కంబోడియా, నేపాల్, చైనా, బంగ్లాదేశ్ ప్రాంతాల నుండి […]

- సౌత్ ఏషియా రీజనల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మేయర్ గుండు సుధారాణి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అంతర్-మునిసిపల్ కోఆపరేషన్ ఫర్ రెసిలెంట్ అండ్ సస్టైనబుల్ సిటీస్” అనే అంశంతో పాటు “ఎగ్జిక్యూటివ్ బ్యూరో మీటింగ్ ” లో భాగంగా సౌత్ ఏషియా రీజనల్ కాన్ఫరెన్స్ లో నగర మేయర్ గుండు సుధారాణి ప్రసంగించారు.
నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన సదస్సులో దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలికి చెందిన(సార్క్) దేశాలైన కంబోడియా, నేపాల్, చైనా, బంగ్లాదేశ్ ప్రాంతాల నుండి మేయర్లు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేయర్ నగరంలో చేపట్టిన శానిటేషన్ విధానం, ప్రజా ప్రాతినిధ్యం అంశాల గురించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా మేయర్ “సిటీ వైడ్ శానిటేషన్ “అంశంలో బల్దియా అవలంబిస్తున్న ఉత్తమ శానిటేషన్ విధానాలైన మరుగుదొడ్లు, ఎఫ్.ఎస్.టి.పిల నిర్వహణ, డిసెంట్రలైజ్డ్ పద్దతులు, సెప్టిక్ ట్యాంక్ ల నిర్వహణ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు, శానిటేషన్ సంబంధ అంశాల్లో మహిళల పాత్ర, సిటీ లెవెల్ శానిటేషన్, పర్యావరణ అంశాలను వివరించారు. పాల్గొన్న దేశాల సభ్యులు లేవనెత్తిన సమస్యలకు సమాధానాలిచ్చారు. బుధవారం నిర్వహించనున్న తొలి సెషన్‌లో నేపాల్ ప్రధాన మంత్రి ప్రచండ హాజరై ప్రసంగిచనున్నారు.
కార్యక్రమంలో నేపాల్ దేశ అర్బన్ ఎఫైర్స్ మంత్రి ప్రకాష్ జ్వాలా, గేట్స్ ఫౌండేషన్ డిప్యూటీ డైరెక్టర్ రోషన్, ఆస్కి వరంగల్ ప్రతినిధి రాజమోహన్, సార్క్ దేశాలకు చెందిన ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.