Warangal | నర్సంపేటలో ‘మెడికల్’ సంబురాలు

Warangal సిటిజన్స్ ఫోరం, ఐఎంఏ, విద్యార్థుల భాగస్వామ్యం పెరుగనున్న విద్యా, వైద్య అవకాశం ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతలు పెద్ది సుదర్శన్ రెడ్డికి అభినందనలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఒక ప్రాంతానికి మెడికల్ కాలేజీ మంజూరు చేశారంటే ఎంతో ప్రత్యేకత సంతరించుకుంటుంది. అందులో ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీ మంజూరు అంటే అప్పుడు ఇప్పుడు మామూలు విషయం కాదు. జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేయడమే గొప్ప అనుకుంటే, ఒక నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీని […]

Warangal | నర్సంపేటలో ‘మెడికల్’ సంబురాలు

Warangal

  • సిటిజన్స్ ఫోరం, ఐఎంఏ, విద్యార్థుల భాగస్వామ్యం
  • పెరుగనున్న విద్యా, వైద్య అవకాశం
  • ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతలు
  • పెద్ది సుదర్శన్ రెడ్డికి అభినందనలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఒక ప్రాంతానికి మెడికల్ కాలేజీ మంజూరు చేశారంటే ఎంతో ప్రత్యేకత సంతరించుకుంటుంది. అందులో ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీ మంజూరు అంటే అప్పుడు ఇప్పుడు మామూలు విషయం కాదు. జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేయడమే గొప్ప అనుకుంటే, ఒక నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీని మంజూరు చేయడం ఆశామాషి వ్యవహారం కాదు. అలాంటి అరుదైన అవకాశం నర్సంపేటకు లభించింది.

నర్సంపేటలో సంబురాలు

తాజా మెడికల్ కాలేజీల మంజూరులో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటకు మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతో అక్కడ సంబరాలు సాగుతున్నాయి. నర్సంపేట సిటిజన్స్ ఫోరం, ఐఎంఏ, వివిధ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు గురువారం ర్యాలీలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

సర్కారుకు ధన్యవాదాలు

ముఖ్యంగా సీఎం కేసీఆర్ కు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి అభినందనలతో ముంచెత్తుతున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రాని అవకాశం నర్సంపేటకు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పెరుగనున్న విద్యా వైద్య అవకాశం

మెడికల్ కాలేజీ ఏర్పాటుతో స్థానికంగా విద్యార్థులకు మెడికల్ విద్యావకాశంతో పాటు స్థానికంగా టీచింగ్ హాస్పిటల్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న హాస్పిటల్లో మరో రెండు వందల యాబై పడకలను పెంచనున్నారు. దీనితో పాటు నర్సింగ్ కాలేజీ, ఇతరత్రా వసతులు పెరగనున్నాయి. ఒక విధంగా నర్సంపేటలో విద్యావాతవరణానికి మెడికల్ కాలేజీ పాదులు వేయనున్నది.

ఇప్పటికే నర్సంపేట పరిసరాలలో రెండు పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో డిగ్రీ, ఇతర కాలేజీలు, విద్యాసంస్థలున్నాయి. వీటికి మెడికల్ కాలేజీ తోడు కానున్నది.

నర్సంపేట చుట్టూ ఉన్న కొత్తగూడం, గూడూరు ఏజెన్సీ ప్రాంతానికి కూడా మెడికల్ విద్యతో పాటు వైద్య వసతులు సమీప ప్రాంతాలలో సమకూరనున్నాయి. ఈ కారణంగానే ఐక్య గిరిజన విద్యార్థి సంఘాలు గురువారం నర్సంపేటలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశాయి.