Warangal | సాకరమైన నర్సంపేట ‘జల కల’
Warangal రూ.336 కోట్లతో రామప్ప-పాకాల ప్రాజెక్టు నిర్మాణం రూ.225 కోట్లతో రామప్ప-రంగాయ చెరువు ప్రాజెక్టు నిర్మాణం గోదారమ్మ రాకతో పులకించిన రైతులు ఎస్సారెస్పీ ద్వారా 46,333 ఎకరాల సాగు పేటలో రెండు పంటలకు సాగునీరు ఫలించిన ఎమ్మెల్యే పెద్ది కృషి 7న సాగునీటి దినోత్సవం 8న ఊరూరా చెరువుల పండగను జయప్రదం చేయండి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో 'జలకల' సాకారమయింది. నర్సంపేటకు గోదావరి […]

Warangal
- రూ.336 కోట్లతో రామప్ప-పాకాల ప్రాజెక్టు నిర్మాణం
- రూ.225 కోట్లతో రామప్ప-రంగాయ చెరువు ప్రాజెక్టు నిర్మాణం
- గోదారమ్మ రాకతో పులకించిన రైతులు
- ఎస్సారెస్పీ ద్వారా 46,333 ఎకరాల సాగు
- పేటలో రెండు పంటలకు సాగునీరు
- ఫలించిన ఎమ్మెల్యే పెద్ది కృషి
- 7న సాగునీటి దినోత్సవం
- 8న ఊరూరా చెరువుల పండగను జయప్రదం చేయండి
- నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ‘జలకల’ సాకారమయింది. నర్సంపేటకు గోదావరి నది జలాలను తీసుకురావడంలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషి, పట్టుదల ఫలించింది. నియోజకవర్గ పరిధిలోని భూములకు రెండు పంటలు పండించే విధంగా సాగునీరు అందించే పథకాలు పూర్తి అయ్యాయి.
సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో రెండు ప్రధాన ప్రాజెక్టులు, చెక్ డ్యాములు, చెరువుల మరమ్మతులు చేపట్టారు. రూ.66 కోట్లతో మిషన్ కాకతీయ ఫెస్-l, ll, lll & lV ల ద్వారా 272 చెరువుల అభివృద్ధి. తద్వారా 32,287 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేశారు. నియోజకవర్గంలోని చెక్ డ్యాంలు, సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల ద్వారా దాదాపు 1,26,099 ఎకరాల ఆయకట్టుని స్థిరీకరించి సాగునీరు అందింస్తున్నారు. చెక్ డ్యాంలను నిర్మించడం వల్ల భూగర్భ జలాల స్థాయి విపరీతంగా పెరిగాయి.
రూ.700 కోట్ల నిధుల ఖర్చు
రూ.336 కోట్లతో రామప్ప-పాకాల ప్రాజెక్టు నిర్మాణం, రూ.225 కోట్లతో రామప్ప-రంగాయ చెరువు ప్రాజెక్టు నిర్మాణం, SRSP-DBM- 38,40,48 కాలువల ద్వారా 46,333 ఎకరాల సాగునీరందుతోంది. రూ.36 కోట్లతో 39 కి.మీ. మేరకు నీటి నిల్వను ఉంచే 13 చెక్ డ్యాంల నిర్మాణాన్ని పూర్తి చేశారు.
ఇదిలా ఉండగా రామప్ప- రంగాయ చెరువు ప్రాజెక్టు ప్రధాన పనులు పూర్తిచేసుకోవడంతో పాటు, రెండు ఏండ్లుగా వస్తున్న గోదావరి జలాలు వినియోగించుకుంటున్నారు. మరో ఆరు నెలల్లో పంట కాలువలు పూర్తి కానున్నాయి. రూ.8 కోట్లతో చేపట్టిన మాదన్నపేట మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.
7న సాగునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండగ: ఎమ్మెల్యే పెద్ది
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 7న సాగునీటి దినోత్సవం జరపాలని, జూన్ 8న ఊరూరా చెరువుల పండగ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో రైతులు, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నిర్వహించ తలపెట్టామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమం మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ రైతులతో ర్యాలీని నిర్వహిస్తాం.
అనంతరం భారీ సభను ఏర్పాటుచేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ రెండు కార్యక్రమాలను దిగ్విజయం చేయాల్సిందిగా నియోజవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు, రైతు సోదరులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అభివృద్ధి సాధించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.