Warangal | ప్రజల వద్దకు ‘పోలీస్ ప్రజావాణి’.. జనగామలో పాల్గొన్న CP రంగనాథ్
Warangal విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజల వద్దకు పొలీస్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా తొలిసారి వరంగల్ పోలీస్ కమిషనర్ స్థాయి అధికారి జనగామ డిసిపి కార్యాలయంలో పాల్గొన్నారు. జనగామలో గురువారం పోలీస్ ప్రజావాణి నిర్వహించగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని పరిశీలించిన అనంతరం సంబంధిత పోలీస్ అధికారులకు సమస్య పరిష్కారానికి పలుసూచనలు చేశారు. కార్యక్రమంలో వెస్ట్ జోన్ డిసిపి సీతారాం, ఏసీపీ దేవేందర్ రెడ్డి, జనగామ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ […]

Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజల వద్దకు పొలీస్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా తొలిసారి వరంగల్ పోలీస్ కమిషనర్ స్థాయి అధికారి జనగామ డిసిపి కార్యాలయంలో పాల్గొన్నారు.
జనగామలో గురువారం పోలీస్ ప్రజావాణి నిర్వహించగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని పరిశీలించిన అనంతరం సంబంధిత పోలీస్ అధికారులకు సమస్య పరిష్కారానికి పలుసూచనలు చేశారు.
కార్యక్రమంలో వెస్ట్ జోన్ డిసిపి సీతారాం, ఏసీపీ దేవేందర్ రెడ్డి, జనగామ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.