Warangal | మురుగును తొలగించేందుకు మ్యాన్ హోల్‌లోకి దిగిన కార్మికుడు.. ఇద్దరిపై వేటు
Warangal వరంగల్ సిటీలో కలకలం సృష్టించిన ఘటన.. శానిటరీ ఇన్స్పెక్టర్, జవాన్ సస్పెన్షన్ స్పందించిన మేయర్, కలెక్టర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మురుగు కాలువలో అడ్డు ఉన్న చెత్తను తొలగించేందుకు మ్యాన్ హోల్ లోకి దిగి మున్సిపల్ కార్మికుడు శుభ్రం చేసిన ఘటన బల్దియాలో కలకలం సృష్టించింది. ఆధునిక కాలంలో కూడా అమానవీయమైన పద్ధతిని అనుసరించే విధంగా కార్మికుడిని మ్యాన్ హోల్ లోకి దింపి చెత్తను తొలగించిన సంఘటన వరంగల్ నగరంలో తీవ్ర చర్చనీయాశంగా మారింది. […]

Warangal
- వరంగల్ సిటీలో కలకలం సృష్టించిన ఘటన..
- శానిటరీ ఇన్స్పెక్టర్, జవాన్ సస్పెన్షన్
- స్పందించిన మేయర్, కలెక్టర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మురుగు కాలువలో అడ్డు ఉన్న చెత్తను తొలగించేందుకు మ్యాన్ హోల్ లోకి దిగి మున్సిపల్ కార్మికుడు శుభ్రం చేసిన ఘటన బల్దియాలో కలకలం సృష్టించింది. ఆధునిక కాలంలో కూడా అమానవీయమైన పద్ధతిని అనుసరించే విధంగా కార్మికుడిని మ్యాన్ హోల్ లోకి దింపి చెత్తను తొలగించిన సంఘటన వరంగల్ నగరంలో తీవ్ర చర్చనీయాశంగా మారింది.
బల్దియా తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. నగరంలోని హనుమకొండ ప్రాంతంలోని కొత్తూరులో చెత్త తొలగించేందుకు మ్యాన్ హోల్ లోకి కార్మికుని దింపి శుభ్రం చేయించారు. ఈ సంఘటన సమాచారం తెలిసిన మేయర్, కమిషనర్ లు తీవ్రంగా పరిగణించి స్పందించారు.
ఇద్దరు బల్దియా సిబ్బందిపై వేటు
ఈ ఘటనకు బాద్యులైన సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ భాస్కర్, జవాన్ రవిలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్, ఇన్‌చార్జి కమిషనర్ ప్రావీణ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇలాంటి చర్యలను ఉపేక్షించం: మేయర్ సుధారాణి
డ్రైనేజీలోకి దిగి వ్యర్థాలను చేతులతో తొలగించడం విచారకరం. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదు. జిడబ్ల్యూ ఎంసీ వ్యాప్తంగా అత్యాధునిక పారిశుధ్య విధానాలు అవలంభిస్తున్నాం. కార్మికులచే ఇలాంటి అమానవీయ పనులు చేయించడానికి వీలు లేదు. చట్టాలను అధికారులు గౌరవించాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బల్దియా వ్యాప్తం గా అన్ని డివిజన్ లలో పర్యవేక్షణను పటిష్టం చేస్తామని మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు.