Delhi Metro | ఢిల్లీ మెట్రోలో.. ఇద్దరు యువ‌కుల ఫైటింగ్‌! వీడియో వైర‌ల్‌

విధాత: బిగ్‌బాస్ ఎపిసోడ్ల త‌ర‌హాలో ప్రతి వారం జ‌నాల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి తాము సిద్ధంగా ఉంటామ‌ని దిల్లీ మెట్రో ఎప్ప‌టిక‌ప్పుడు రుజువు చేస్తోంది. తాజాగా ఈ మెట్రో మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఈ సారి డ్యాన్స్ రీల్సో, కుర్ర‌కారు రొమాన్సో కాదు.. ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య ఫైటింగ్‌. దిల్లీ మెట్రో (Delhi Metro) రైలులో డ‌బ్ల్యూడ‌బ్ల్యూఎఫ్ త‌ర‌హాలో ప‌ర‌స్ప‌రం పిడిగుద్దులు కురిపించుకున్న వీడియో తాజాగా నెట్టింట్లో చ‌ర్చ‌కు దారితీసింది. ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ బ్యాక్‌పాక్ […]

Delhi Metro | ఢిల్లీ మెట్రోలో.. ఇద్దరు యువ‌కుల ఫైటింగ్‌! వీడియో వైర‌ల్‌

విధాత: బిగ్‌బాస్ ఎపిసోడ్ల త‌ర‌హాలో ప్రతి వారం జ‌నాల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి తాము సిద్ధంగా ఉంటామ‌ని దిల్లీ మెట్రో ఎప్ప‌టిక‌ప్పుడు రుజువు చేస్తోంది. తాజాగా ఈ మెట్రో మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఈ సారి డ్యాన్స్ రీల్సో, కుర్ర‌కారు రొమాన్సో కాదు.. ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య ఫైటింగ్‌. దిల్లీ మెట్రో (Delhi Metro) రైలులో డ‌బ్ల్యూడ‌బ్ల్యూఎఫ్ త‌ర‌హాలో ప‌ర‌స్ప‌రం పిడిగుద్దులు కురిపించుకున్న వీడియో తాజాగా నెట్టింట్లో చ‌ర్చ‌కు దారితీసింది.

ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ బ్యాక్‌పాక్ ధ‌రించిన ఇద్ద‌రు యువ‌కులు గొడ‌వ‌కు దిగ‌డంతో వీడియో మొద‌లైంది. తొలుత చుట్టుప‌క్క‌ల ఉన్న‌వారు చూస్తూ ఉండిపోయినా.. త‌ర్వాత గొడ‌వ ముద‌ర‌డంతో వారిని విడ‌దీయ‌డానికి ప్ర‌య‌త్నించారు. అయినా ఫ‌లితం లేక‌పోయింది. వారిద్ద‌రూ త‌మ‌ను ప‌ట్టుకున్న వాళ్ల నుంచి విడిపించుకుని మ‌రీ పిడి గుద్దులు కురిపించుకున్నారు. గెంటేసుకున్నారు.

ఈ వీడియోపై దిల్లీ మెట్రో స్పందించింది. మెట్రోలో ప్ర‌యాణించేవారు వ్య‌క్తిగ‌త స్థాయిలో స‌త్ప్ర‌వ‌ర్త‌న‌తో ఉండాల‌ని కోరింది. తోటి ప్ర‌యాణికులు ఎవ‌రైనా ఇబ్బందిక‌ర చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే వెంట‌నే ఫిర్యాదు చేయాల‌ని సూచించింది.

ఇటీవ‌ల రైళ్ల‌లో త‌ర‌చూ వివాదాస్ప‌ద చ‌ర్య‌లు చోటుచేసుకుంటుండ‌టంతో మెట్రో అధికారులు ఫ్ల‌యింగ్ స్క్వాడ్‌ల‌ను నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఈ డ‌బ్ల్యూడ‌బ్ల్యూఎఫ్ ఫైటింగ్‌పై ప‌లువురు యూజ‌ర్లు స్పందించారు. వీరికి జీవితంలో ఇక ఏ స‌మ‌స్య‌లూ లేవా అని ఒక‌రు వ్యాఖ్యానించ‌గా.. దిల్లీ మెట్రోలో వినోదానికి కొద‌వ ఉండ‌ద‌ని మ‌రొక‌రు స్పందించారు.