కూరలో పన్నీరు ముక్కలు లేవని గొడవ.. పెళ్లిలో కుర్చీలు విసురుకున్న ఇరు వర్గాలు
పెళ్లిళ్లలో అతిథి మర్యాదలు తక్కువైతే అబ్బాయి తరఫు వారు రుసరుసలాడటం.. అమ్మాయి తరఫు వారు సర్ది చెప్పడం తరచూ జరిగిదే.

విధాత: పెళ్లిళ్లలో అతిథి మర్యాదలు తక్కువైతే అబ్బాయి తరఫు వారు రుసరుసలాడటం.. అమ్మాయి తరఫు వారు సర్ది చెప్పడం తరచూ జరిగిదే. కొన్ని సార్లు ఆ రుసరుసలు ఎక్కువై.. సర్దుబాటు తక్కువైనప్పుడు గొడవలు జరిగి పెళ్లి పీటల మీదే ఆ వివాహం ఆగిపోయిన ఘటనలూ ఉన్నాయి. ఈ గొడవలు (Clash in marriage) ఎక్కువగా భోజనాల దగ్గరే రావడం మరో విశేషం. తాజాగా ఓ వివాహంల పెట్టిన భోజనాల్లో పన్నీర్ లేదని అబ్బాయి, అమ్మాయి తరఫు వారి మధ్య పెద్ద గలాటా చెలరేగింది.
మటర్ పన్నీర్ (Paneer) లో పనీర్ ముక్కలు లేకపోవడం ఏంటని ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. బఠానీలు, పన్నీర్‌తో చేసే ఈ మటర్ పన్నీర్.. ఉత్తరాదిలో చాలా ప్రసిద్ధ వంటకం. దీనికి చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ వడ్డిస్తారు. తాజాఆ జరిగిన ఈ ఘటన వీడియోను ఘర్ కే కైలాశ్ అనే అకౌంట్లో పోస్ట్ చేశారు. కొద్ది సేపటికే దీనిని రెండు లక్షల వ్యూలు రాగా 1,600 లైక్‌లు వచ్చాయి. వంట గదిని, టేబుళ్లను ధ్వంసం చేసిన అతిథులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ కొట్టుకున్నారు. కుర్చీలకు విసిరేసుకున్నారు.
ఈ వీడియోను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఒక జంట కలలు కనే వేడుకను వీరంతా నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నీరు లేకపోవడం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసిందని ఒక యూజర్ ఎద్దేవా చేశారు. పదుల కొద్దీ మీమ్‌లు, జోక్‌లను పలువురు యూజర్లు షేర్ చేశారు. ఇదే తరహాలో పెళ్లిలో పన్నీర్ వేయలేదని పెళ్లిలో గొడవ అయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
దేశంలో కొన్ని కొన్ని చోట్ల పన్నీర్ సంపద్రాయంలో భాగంగా మారిపోయిందని.. ఎంతలా అంటే అది లేకపోతే గొడవలు జరిగే స్థితికి చేరుకుందని పలువరు పేర్కొన్నారు. ప్రొటీన్‌లు, యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉండే పన్నీర్‌ను తింటే బరువు తగ్గుతారు. ఇవే కాకుండా విటమిన్ ఏ, బీ1, బీ6, ఇ, సెలీనియమ్‌లు కూడా ఇందులో ఉంటాయి. అందుకే పన్నీరుకు అంత క్రేజ్.