వారానికి మూడు రోజులే ఆఫీస్
-ఉద్యోగులకు అమెజాన్ ఆఫర్ -మే 1 నుంచి మొదలవుతుందని సందేశం విధాత: దేశంలో కరోనా ఉద్ధృతి, కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం నుంచి ఉద్యోగులు నెమ్మదిగా ఆఫీసుల బాట పడుతున్నారు. ఆయా సంస్థలూ తమ ఉద్యోగులను తిరిగి పిలుస్తున్నాయి. అమెజాన్ సైతం ఉద్యోగులు ఇక కార్యాలయాలకు హాజరు కావాలంటున్నది. మే 1 నుంచి అంతా ఆఫీస్‌కు రావాలని, అయితే వారానికి మూడు రోజులేనని ఉద్యోగులకు అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ తాజాగా పంపిన […]

-ఉద్యోగులకు అమెజాన్ ఆఫర్
-మే 1 నుంచి మొదలవుతుందని సందేశం
విధాత: దేశంలో కరోనా ఉద్ధృతి, కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం నుంచి ఉద్యోగులు నెమ్మదిగా ఆఫీసుల బాట పడుతున్నారు. ఆయా సంస్థలూ తమ ఉద్యోగులను తిరిగి పిలుస్తున్నాయి. అమెజాన్ సైతం ఉద్యోగులు ఇక కార్యాలయాలకు హాజరు కావాలంటున్నది.
మే 1 నుంచి అంతా ఆఫీస్‌కు రావాలని, అయితే వారానికి మూడు రోజులేనని ఉద్యోగులకు అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ తాజాగా పంపిన ఓ ఈ-మెయిల్ సందేశంలో పేర్కొన్నారు. ఇప్పటికే యాపిల్, వాల్‌మార్ట్, డిస్నీవంటి గ్లోబల్ కార్పొరేట్ దిగ్గజాలు.. ఆఫీసులకు రావాలని తమ ఉద్యోగులకు స్పష్టం చేశాయి. ఇప్పుడు వీటి సరసన అమెజాన్ కూడా చేరింది.
నిజానికి ఆఫీసు నుంచి వారంలో ఎన్ని రోజులు పనిచేయాలన్నది ఇండివిడ్యువల్ టీమ్సే నిర్ణయించుకోవాలని 2021 అక్టోబర్‌లో అమెజాన్ స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉండటంతో వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలని ఆదేశాలు జారీ చేసింది.