West Bengal | బెంగాల్ ఎన్నిక‌లు హింసాత్మ‌కం.. స్వ‌తంత్ర అభ్య‌ర్థి కూతురి నుదుటిపై కాల్పులు

West Bengal విధాత‌: ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొన‌సాగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ హింసాత్మ‌కంగా మారింది. పోలింగ్ కొన‌సాగుతున్న ప‌లు ప్రాంతాల్లో బుల్లెట్ల వ‌ర్షం కురిసింది. ర‌క్త‌పుటేరులు పారాయి. దీంతో ప‌లు ప్రాంతాల్లో యుద్ధ వాతావ‌ర‌ణం త‌ల‌పిస్తోంది. ఓ స్వ‌తంత్ర అభ్య‌ర్థి కూతురి నుదుటిపై తుపాకీతో కాల్చిన ఘ‌ట‌న తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. వెస్ట్ బెంగాల్‌లోని హుగ్లీలో తృణ‌మూల్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోయారు. త‌ర‌కేశ్వ‌ర్ నుంచి పింటూ సింగ్‌కు టీఎంసీ టికెట్ ఇవ్వ‌లేదు. దీంతో […]

West Bengal | బెంగాల్ ఎన్నిక‌లు హింసాత్మ‌కం.. స్వ‌తంత్ర అభ్య‌ర్థి కూతురి నుదుటిపై కాల్పులు

West Bengal

విధాత‌: ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొన‌సాగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ హింసాత్మ‌కంగా మారింది. పోలింగ్ కొన‌సాగుతున్న ప‌లు ప్రాంతాల్లో బుల్లెట్ల వ‌ర్షం కురిసింది. ర‌క్త‌పుటేరులు పారాయి. దీంతో ప‌లు ప్రాంతాల్లో యుద్ధ వాతావ‌ర‌ణం త‌ల‌పిస్తోంది. ఓ స్వ‌తంత్ర అభ్య‌ర్థి కూతురి నుదుటిపై తుపాకీతో కాల్చిన ఘ‌ట‌న తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది.

వెస్ట్ బెంగాల్‌లోని హుగ్లీలో తృణ‌మూల్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోయారు. త‌ర‌కేశ్వ‌ర్ నుంచి పింటూ సింగ్‌కు టీఎంసీ టికెట్ ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేశారు. ఈ క్ర‌మంలో ఇవాళ పోలింగ్ జ‌రుగుతుండ‌గానే, పింటూ సింగ్ కుమార్తెపై టీఎంసీ కార్య‌క‌ర్త‌లు తుపాకీతో కాల్పులు జ‌రిపారు.

ఆమె నుదుటికి బుల్లెట్ దిగ‌డంతో.. చికిత్స నిమిత్తం కోల్‌క‌తా మెడిక‌ల్ కాలేజీకి త‌ర‌లించారు. పింటూ సింగ్ నివాసంలోకి చొచ్చుకెళ్లిన కొంత మంది.. అత‌ని కుటుంబ స‌భ్యుల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడులకు పాల్ప‌డ్డారు. తుపాకీతో బెదిరింపుల‌కు గురి చేశారు.

చివ‌ర‌కు చిన్నారి నుదిటిపై కాల్పులు జ‌రిపి భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టించారు. పింటూ సింగ్ ఇంట్లో నుంచి బాంబులు, బుల్లెట్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహ‌రించారు. అయితే పింటూ సింగ్ కుటుంబంపై టీఎంసీ కార్య‌క‌ర్త‌లు దాడి చేశార‌న్న వార్త‌ల‌ను ఆ పార్టీ నాయ‌క‌త్వం ఖండించింది. ఆ ఘ‌ట‌న‌కు త‌మ పార్టీకి ఎలాంటి సంబంధం లేద‌ని పేర్కొన్నారు.