WhatsApp Feature | మరో ఫీచర్‌ను పరిచయం చేయబోతున్న వాట్సాప్‌.. అవతార్‌తో రీప్లే ఇచ్చేలా..!

WhatsApp Feature | ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్‌ను పరిచయం చేసిన కంపెనీ తాజాగా మరో ఫీచర్‌ను తీసుకు రాబోతున్నది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంచింది. ఈ ఫీచర్‌ సహాయంతో త్వరలో మీరు ద్వారా వాట్సాప్‌ స్టేటస్‌కు సైతం రిప్లే ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సాధారణంగా స్టేటస్‌కి ఎమోజీలు, మెసేజ్‌ల ద్వారా రిప్లే ఇస్తూ వస్తున్నారు. […]

WhatsApp Feature | మరో ఫీచర్‌ను పరిచయం చేయబోతున్న వాట్సాప్‌.. అవతార్‌తో రీప్లే ఇచ్చేలా..!

WhatsApp Feature |

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్‌ను పరిచయం చేసిన కంపెనీ తాజాగా మరో ఫీచర్‌ను తీసుకు రాబోతున్నది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంచింది. ఈ ఫీచర్‌ సహాయంతో త్వరలో మీరు ద్వారా వాట్సాప్‌ స్టేటస్‌కు సైతం రిప్లే ఇచ్చే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం సాధారణంగా స్టేటస్‌కి ఎమోజీలు, మెసేజ్‌ల ద్వారా రిప్లే ఇస్తూ వస్తున్నారు. దీనికి అవతార్‌కు సంబంధించి మరో ఆప్షన్‌ అందుబాటులోకి రానున్నదని వాట్సాప్‌ డెవలప్‌మెంట్‌ను పర్యవేక్షించే Wabetainfo వెబ్‌సైట్‌ పేర్కొంది.

ఎమోజీల తరహాలోనే యూజర్లు రీప్లే ఇచ్చేందుకు కంపెనీ ఎనిమిది అవతార్‌లకు ఆప్షన్స్‌ ఇస్తుంది. అవతార్ల ద్వారా యూజర్లు తమ భావాలను వ్యక్తీకరించుకునేందుకు అవకాశం దొరుకుతుంది. అలాగే యాప్‌ ఎక్స్‌పీరియన్స్‌ను సైతం మెరుగుపరుచనున్నది. ప్రస్తుతం బీటా టెస్టర్లకు అందుబాటులో ఉన్నది.

విజయవంతమైతే యూర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నది. ఇదిలా ఉండగా.. మెటా యాజమాన్యంలో వాట్సాప్‌ ఇటీవల యూజర్లకు హెచ్‌డీ ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసుకునేందుకు ఫీచర్‌ను పరిచయం చేసింది.

హెచ్‌డీ ఫొటోలను షేర్‌ చేసేందుకు మీరు ఫొటోను పంపే సమయంలో హెచ్‌డీ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అలాగే వీడియోను సైతం షేర్‌ చేసే సమయంలో స్టాండర్డ్‌కు బదులుగా హెచ్‌డీ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం వాట్సాప్‌ యూజర్‌నేమ్, రీసెంట్ హిస్టరీ షేర్, మల్టిపుల్ అకౌంట్ లాగిన్ కొత్త ఫీచర్లపై పని చేస్తున్నది.