WhatsApp | వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ‘కాల్‌ బ్యాక్‌ ఫీచర్‌’ను తీసుకువస్తున్న మెటా..!

WhatsApp | మెస్సేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తున్నది. తాజాగా మిస్డ్ వాయిస్, వీడియో కాల్స్‌కు కాల్ బ్యాక్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది. మిస్డ్ కాల్ వివరాలు మరింత స్పష్టంగా తెలిసేలా వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేస్తున్నది. ఈ విషయాన్ని వాట్సాప్ తాజా అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు వినియోగదారులకు అందించే WABetaInfo వెల్లడించింది. అందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేసింది. అందులో వాట్సాప్‌లో స్పష్టంగా కనిపించేలా కాల్ బ్యాక్ (Call back) ఆప్షన్ ఉంది. మెసేజెస్ […]

WhatsApp | వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ‘కాల్‌ బ్యాక్‌ ఫీచర్‌’ను తీసుకువస్తున్న మెటా..!

WhatsApp | మెస్సేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తున్నది. తాజాగా మిస్డ్ వాయిస్, వీడియో కాల్స్‌కు కాల్ బ్యాక్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది. మిస్డ్ కాల్ వివరాలు మరింత స్పష్టంగా తెలిసేలా వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేస్తున్నది.

ఈ విషయాన్ని వాట్సాప్ తాజా అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు వినియోగదారులకు అందించే WABetaInfo వెల్లడించింది. అందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేసింది. అందులో వాట్సాప్‌లో స్పష్టంగా కనిపించేలా కాల్ బ్యాక్ (Call back) ఆప్షన్ ఉంది.

మెసేజెస్ లోనే మిస్డ్ కాల్ వివరాలతో పాటు, కాల్‌ బ్యాక్‌ ఆప్షన్ సైతం ఫొటోలో చూపిన విధంగా కనిపిస్తుంది. ఆ కాల్ బ్యాక్ ఆప్షన్‌ను టచ్ చేయడం ద్వారా నేరుగా ఆ కాంటాక్ట్‌కు వాట్సాప్ కాల్ ద్వారా కాల్ బ్యాక్ చేసుకునేందుకు అవకాశం కలుగనున్నది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్‌ దశలో ఉంది.

కొద్దిమంది ఎంపిక చేసిన బీటా యూజర్లకు మాత్రమే తమ వాట్సాప్‌లో కనిపిస్తుంది. టెస్టింగ్‌ ముగిసిన తర్వాత బగ్స్, టెక్నికల్ ఎర్రర్స్‌ బయటపడితే వాటిని సరిదిద్ది మరోసారి పరీక్షించి.. విజయవంతమైన తర్వాత యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నది.