నయనతార, మాళవికాలలో ఎవరి వాదన కరెక్ట్?
విధాత: సినిమాలు రెండు రకాలుగా చాలామంది భావిస్తారు. అందులో ఒకటి కమర్షియల్ సినిమా.. రెండు రియలిస్టిక్ సినిమా. ఈ రెండూ విభిన్నదారులలో నడుస్తాయి. మొదటి దానిలో ప్రేక్షకులను మనం కూడా ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుంది అనేలా ఊహ ప్రపంచంలోకి తీసుకెళ్లేది కమర్షియల్ సినిమా. కానీ నిజజీవితంలో ఏదైనా సంఘటన జరిగితే మనం కూడా ఇలాగే ప్రవర్తిస్తాము కదా అనిపించేది రియలిస్టిక్ సినిమా. అయితే ఈ రెండింటి మధ్య ఒక సన్నని గీత కూడా ఉంది. కమర్షియల్ […]

విధాత: సినిమాలు రెండు రకాలుగా చాలామంది భావిస్తారు. అందులో ఒకటి కమర్షియల్ సినిమా.. రెండు రియలిస్టిక్ సినిమా. ఈ రెండూ విభిన్నదారులలో నడుస్తాయి. మొదటి దానిలో ప్రేక్షకులను మనం కూడా ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుంది అనేలా ఊహ ప్రపంచంలోకి తీసుకెళ్లేది కమర్షియల్ సినిమా. కానీ నిజజీవితంలో ఏదైనా సంఘటన జరిగితే మనం కూడా ఇలాగే ప్రవర్తిస్తాము కదా అనిపించేది రియలిస్టిక్ సినిమా. అయితే ఈ రెండింటి మధ్య ఒక సన్నని గీత కూడా ఉంది. కమర్షియల్ సినిమాలను కూడా రియల్ స్టిక్‌గా తీయవచ్చు.
రియలిస్టిక్ సినిమాలలో కూడా కమర్షియల్ అంశాలను చేర్చవచ్చు. ఈ వ్యత్యాసాన్ని నయనతార విస్మరించిందని చెప్పాలి. ఈ విషయంలో కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతారకు మరో తమిళ హీరోయిన్ మాళవిక మోహన్‌కు మధ్య విభేదాలు, మాటల తూటాలు పేలుతున్నాయి. సినిమాకు సంబంధించి దర్శకులు ఏం చెబితే అదే చేస్తానని నయనతార అంటుంది. సినిమాలకు రియలిస్టిక్, కమర్షియల్ అనే వ్యత్యాసం ఉంటుందని, దాన్ని కొంతమంది గ్రహించాలని అంటోంది.
గతంలో హీరోయిన్ మాళవిక మోహనన్.. నయనతార సినిమా గురించి మాట్లాడుతూ.. అగ్ర కథానాయక, సూపర్ స్టార్‌గా పేరు సొంతం చేసుకున్న ఓ నటి ఆసుపత్రి సన్నివేశంలోనూ ఫుల్ మేకప్ వేసుకుని, లిప్‌స్టిక్, హెయిర్ స్టైల్ అన్ని చక్కగా అలంకరించుకుంది. ఆ సీన్స్ చూసి నేను షాక్ అయ్యాను. ఎంత కమర్షియల్ సినిమా అయితే మాత్రం కాస్తయినా వాస్తవంగా ఉండాలి కదా అనిపించింది అని కామెంట్ చేసింది. దానికి బదులుగానే నయనతార తాజా వ్యాఖ్యలు చేస్తోందని అర్థమవుతుంది.
తన తాజా చిత్రం ‘కనెక్ట్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నయనతార నేను దర్శకుల నటిని. సినిమాకు అనుగుణంగా వాళ్లు ఏం చెబితే అదే చేస్తాను. డ్రెస్సింగ్, మేకప్, లుక్స్, హావభావాలు.. ఇలా ప్రతి విషయాన్ని వారు చెప్పిన విధంగా ఫాలో అవుతా. అయితే నేను గతంలో ఒక ఇంటర్వ్యూ చూశాను. అందులో ఒక హీరోయిన్ నా డ్రెస్సింగ్ స్టైల్, మేకప్ గురించి కామెంట్ చేసింది.
ఆమె పేరు నాకు చెప్పాలని లేదు. ఆసుపత్రి సీనులో నేను మేకప్ లిప్స్టిక్ హెయిర్ స్టైల్ చక్కగా వేసుకోవడం ఆమె తప్పు పట్టింది. అయితే నేను చెప్పేది ఒకటే. సినిమాల విషయంలో చిన్న వ్యత్యాసం ఉంటుంది. కమర్షియల్, రియలిస్టిక్ మూవీస్ ఉంటాయి. రియలిస్టిక్ మూవీస్‌లో తప్పకుండా లుక్స్ పరంగా జాగ్రత్తలు పాటించాలి. కమర్షియల్ సినిమాలో మాత్రం దర్శకుడు హీరోయిన్స్‌ని ఇలాగే స్టైలిష్‌గా చూపిస్తారు.. అంటూ సున్నితంగా మాళవిక మోహనన్‌కు కౌంటర్ ఇచ్చింది.
ఇక తాను ప్రమోషన్‌కు దూరంగా ఉంటాననే విషయం గురించి మాట్లాడుతూ.. 18 ఏళ్ళ వయసులోనే పరిశ్రమలోకి అడుగు పెట్టాను. అప్పుడు నాకు ఇండస్ట్రీ గురించి ఏమీ తెలీదు.. అందరి బాటలోనే నేను వెళ్లే దాన్ని. కొన్నేళ్ల తర్వాత నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాను. దానికి అనుగుణంగా విభిన్న పాత్రలను పోషించా. ఇప్పుడు హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేస్తున్నాను. నా మొదట్లో సరైన పాత్రలు ఉండేవి కావు.
హీరోయిన్స్ అంటే కేవలం ఆట బొమ్మలు. వారికి ఎందులోనూ ప్రాధాన్యం ఉండదు. దాని గురించి తీవ్రంగా ఆలోచించే దాన్ని. ఆడియో ఫంక్షన్లో హీరోయిన్స్‌ని పక్కన పెట్టేస్తారు. వాళ్ల గురించి అస్సలు మాట్లాడరు.. అవి చూసి విసిగిపోయి సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే నేను ఏ ఫంక్షన్‌లోనూ కనిపించను అని వివరించింది. మొత్తానికి నయనతార చెప్పింది కన్విన్సింగ్‌గానే ఉన్నా… మాళవిక మోహనన్ ఎత్తిన పాయింట్ మాత్రం ఆలోచించదగినది అని కచ్చితంగా చెప్పవచ్చు.