దసరా రోజునే పాలపిట్టను ఎందుకు చూడాలి..? అసలు కథేంటి..?
విధాత: దసరా పండుగను విజయానికి ప్రతీకగా భావిస్తారు. చెడుపై మంచి సాధించిన చిహ్నంగా విజయ దశమిని జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా తప్పకుండా ఆయుధ పూజ నిర్వహిస్తారు. జమ్మి ఆకు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక పాలపిట్టను చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఈ పాలపిట్ట దర్శనానికి కూడా ఎంతో ప్రాశస్త్యం ఉంది. మరి దసరా రోజునే పాలపిట్టను ఎందుకు చూడాలంటారు..? దాని వెనుక ఉన్న అసలు కథేంటి తెలుసుకుందాం.. నీలం, పసుపు రంగులో ఉండే ఈ పాలపిట్ట చెట్లు ఎక్కువగా […]

విధాత: దసరా పండుగను విజయానికి ప్రతీకగా భావిస్తారు. చెడుపై మంచి సాధించిన చిహ్నంగా విజయ దశమిని జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా తప్పకుండా ఆయుధ పూజ నిర్వహిస్తారు. జమ్మి ఆకు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక పాలపిట్టను చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఈ పాలపిట్ట దర్శనానికి కూడా ఎంతో ప్రాశస్త్యం ఉంది. మరి దసరా రోజునే పాలపిట్టను ఎందుకు చూడాలంటారు..? దాని వెనుక ఉన్న అసలు కథేంటి తెలుసుకుందాం..
నీలం, పసుపు రంగులో ఉండే ఈ పాలపిట్ట చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఉంటాయి. జమ్మి ఆకుల కోసం అడవికి వెళ్లిన వారు ఈ పక్షిని చూస్తుంటారు. ఈ పాలపిట్టను పరమేశ్వరుడి స్వరూపంగా కూడా భావిస్తుంటారు. అందుకే విజయ దశమి రోజున ఈ పక్షిని చూస్తే సంవత్సరమంతా విజయాలు అందుతాయ నేది విశ్వాసం. అంతేకాకుండా పాలపిట్ట దర్శనం వెనుక పురాణగాథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి.
త్రేతా యుగంలో శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధం చేయడానికి బయల్దేరే సమయంలో విజయదశమి రోజునే పాలపిట్ట ఎదురు వస్తుంది. అనంతరం జరిగిన యుద్ధంలో శ్రీరాముడు విజయం సాధిస్తాడు. ఇక సీతాదేవిని రావణ చెర నుంచి రాముడు కాపాడుతాడు. అనంతరం అయోధ్యకు రాజుగా మారుతాడు. యుద్ధానికి బయల్దేరే ముందు పాలపిట్ట ఎదురు రావడం వల్లే ఈ విజయం సాధించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి.
అలాగే మహాభారతం ఆధారంగా.. పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు జమ్మి చెట్టు మీద ఆయుధాలను దాచుతారు. ఆ ఆయుధాలకు ఇంద్రుడు పాలపిట్ట రూపంలో కాపాలా కాశాడని పురాణ గాథలు చెబుతున్నాయి. అంతేకాకుండా అజ్ఞాత వాసం ముగించుకొని రాజ్యానికి తిరుగు ప్రయాణమైన సమయంలోనూ పాలపిట్ట దర్శనమిస్తుంది. అప్పటి నుంచి పాండవుల కష్టాలు అన్నీ తొలగిపోయి. కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని తిరిగి పొందుతారు. దీంతో పాలపిట్ట విజయానికి ప్రతీకగా భావిస్తూ విజయ దశమి రోజున పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.