Tea and Coffee | ఉపవాస దీక్షలో టీ, కాఫీ తాగొచ్చా..? తాగితే లాభమా..? నష్టమా..?
Tea and Coffee | దసరా పండుగ( Dasara Festival ) నేపథ్యంలో దేవి నవరాత్రులు( Devi Navaratri ) దేశమంతటా కొనసాగుతున్నాయి. ఈ నవరాత్రుల సందర్భంగా చాలా మంది భక్తులు ఉపవాస( Fasting ) దీక్షలో ఉన్నారు. ఈ ఉపవాస దీక్షలో ఉండి టీ( Tea ), కాఫీ( Coffee ) తాగొచ్చా..? అనే ప్రశ్న చాలా మందిలో ఉత్పన్నమవుతుంది. మరి టీ, కాఫీ తాగొచ్చా..? లేదా..? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
Tea and Coffee | దేవీ నవరాత్రుల( Devi Navaratri ) సందర్భంగా దుర్గామాత( Durga Mata )ను ఈ తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో పూజిస్తారు. ఈ సందర్భంగా చాలా మంది భక్తులు ఉపవాస( Fasting ) దీక్ష చేస్తుంటారు. ఈ ఉపవాస దీక్షల సందర్భంగా ఏం తినాలి..? ఏం తినకూడదు..? ఏం తాగాలి..? ఏం తాగకూడదు..? అనేది అతి పెద్ద ప్రశ్న. చాలా మంది పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోరు. కొందరు ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు. మరికొందరు కేవలం టీ( Tea ), కాఫీ( Coffee )తో సరిపెట్టుకుంటారు. అయితే ఈ ఉపవాస దీక్షలో టీ, కాఫీలు సేవించడం సరైందేనా..? కాదా..? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉపవాస దీక్షలో టీ, కాఫీ తాగడం ఎంత వరకు కరెక్ట్..?
దేవీ నవరాత్రుల సందర్భంగా చాలా మంది ఉపవాస దీక్ష పాటిస్తుంటారు. ఉపవాస దీక్షలో భాగంగా కొందరు పండ్లు, పాలు, తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటారు. మరికొందరు టీ, కాఫీలు తీసుకుంటారు. అయితే టీ, కాఫీలు అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ వాదిస్తున్నారు. ఎందుకంటే ఉపవాస సమయంలో కడుపు చాలా ఖాళీగా ఉంటుంది. ఈ క్రమంలో కెఫిన్ కలిగిన పానీయాలు తీసుకోవడం వల్ల గ్యాస్, గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. కాఫీ ముఖ్యంగా అధిక ఆమ్లత్వం కలిగి ఉంటుంది. కాబట్టి ఖాళీ కడుపుతో తాగడం వల్ల సమస్యలు పెరుగుతాయి. అదేవిధంగా టీలో చక్కెర, పాలు ఎక్కువగా ఉంటే, అది జీర్ణక్రియలో ఇబ్బందిని కలిగిస్తుంది. అందువల్ల, మీరు టీ, కాఫీ తాగే అలవాటు కలిగి ఉంటే, ఒకటి కంటే ఎక్కువ తీసుకోకుండా ఉండాలి. అలాగే, చక్కెర తక్కువగా ఉండేలా చూసుకుంటే బెటర్ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ పానీయాలు బెటర్..!
ఉపవాస దీక్ష చేస్తున్న సమయంలో శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. శక్తిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి టీ, కాఫీలకు దూరంగా ఉండి.. శక్తిని పెంచే పానీయాలు తీసుకోవడం బెటర్. అవి ఏంటంటే.. కొబ్బరి నీరు, నిమ్మకాయ రసం, పండ్ల రసాలు లేదా పాలు వంటి పానీయాలను తీసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలిగించవు. శరీరాన్ని నిత్యం హైడ్రేట్‌గా ఉంచుతాయి. తక్షణ శక్తినివ్వడంతో నీరసానికి గురి కాకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram