Fatty Liver: ఫ్యాటీ లివర్‌కు కాఫీతో చెక్ పెట్టేయొచ్చు!

దేశంలో ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య రోజురోజుకు పెరుగుతూ వ‌స్తోంది. ఈ స‌మ‌స్య ప్రతి నలుగిరిలో ఒకరికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు

Fatty Liver: ఫ్యాటీ లివర్‌కు కాఫీతో చెక్ పెట్టేయొచ్చు!

దేశంలో ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య రోజురోజుకు పెరుగుతూ వ‌స్తోంది. ఈ స‌మ‌స్య ప్రతి నలుగిరిలో ఒకరికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ‌గా మ‌ద్యం సేవించే వారిలో, ఫాస్ట్‌ఫుడ్, స్ట్రీట్ ఫుడ్‌ అంటూ అధికంగా జంక్ ఫుడ్ తినే వారిలో ఫ్యాటీలివ‌ర్ స‌మ‌స్య ఏర్పడి, చివ‌ర‌కు అది కాలేయాన్ని పూర్తిగా ప‌నిచేయ‌కుండా చేస్తోందని వైద్యులు తెలుపుతున్నారు. ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధికంగా మద్యం సేవించడం, ఊబకాయం, మధుమేహం వంటివి ఈ సమస్యకు ముఖ్య కారకాలని వైద్యలు వెల్లడించారు.

సాధారణంగా మనిషి కాలేయంలో కొంత కొవ్వు ఉంటుంది. కానీ ఈ కొవ్వు లివర్ మొత్తం బరువులో 5 నుంచి 10 శాతం కంటే ఎక్కువగా మారినప్పుడు, దాన్ని ఫ్యాటీ లివర్ అని అంటారు. దీన్ని హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా పిలుస్తారు.

ముఖ్యంగా, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని, దీని గురించి చాలా మందికి అవగాహన ఉండటం లేదని నిపుణులు చెబుతున్నారు. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ చివరికి గుండె సంబంధిత వ్యాధులకు కూడా దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది ప్రపంచంలోనే అత్యంత సాధారణ కాలేయ వ్యాధిగా మారింది. ప్రపంచ జనాభాలో దాదాపు 25% నుండి 32% మందికి ఈ వ్యాధి ఉన్నట్లు సర్వేల్లో తేలింది. కొన్ని అధ్యయనాలు ఈ సంఖ్యను 38% వరకు కూడా చూపుతున్నాయి. ఈ వ్యాప్తి రేటు గత మూడు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగిందట. ఉదాహరణకు, 1990-2006 మధ్య నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాప్తి సుమారు 25.3 శాతం ఉండగా, 2016-2019 నాటికి ఇది 38.2 శాతానికి పెరిగింది.

అసలు ఈ ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిండడంలో కాఫీ, గ్రీన్ టీలు ఎలా సహాయపడుతాయో తెలుసుకుందాం.. ప్రతి రోజు ఉద‌యం కాఫీ, గ్రీన్ టీ తాగితే కాలేయానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని నిపుణులు అంటున్నారు. చెక్కర లేకుండా బ్లాక్ కాఫీ మితంగా తీసుకుంటే ఆరోగ్యక‌రంగా చాలా ప్రయోజనాలు ఉన్నట్లు ప‌లు నివేదిక‌ల్లో వెల్లడైంది.

ఒక్క ఫ్యాటీ లివ‌ర్ సమస్య మాత్రమే కాకుండా లివ‌ర్ సిర్రోసిస్ అనే వ్యాధిని త‌గ్గించ‌డంలో కూడా కాఫీ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుండ‌ట‌. దీర్ఘకాలిక లివ‌ర్ సమస్యలతో స‌త‌మ‌త‌మైతున్నవారిలో కాఫీ తాగితే 71శాతం మెరుగుప‌డుతుంద‌ని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.