Alzheimers | ఇది తరచూ తీసుకుంటే అల్జీమ‌ర్స్‌ను ఆమ‌డ దూరం త‌రిమేయ‌వ‌చ్చట‌..!

Alzheimers : ఒక కప్పు వేడివేడి కాఫీ లేకుండా రోజును ప్రారంభించలేని వాళ్లలో మీరు కూడా ఒకరా..? ఉదయాన్నే కాఫీ లేకపోతే మీరు ఉక్కిరిబిక్కిరి అవుతారా..? అయితే ఇటీవ‌ల జ‌రిగిన ఓ అధ్యయ‌నం మీకొక శుభ‌వార్త తెలియ‌జేస్తున్నది. ఎక్కువ మొత్తంలో కాఫీ తీసుకోవ‌డంవ‌ల్ల అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుందని తాజా పరిశోధనలో తేలింది.

Alzheimers | ఇది తరచూ తీసుకుంటే అల్జీమ‌ర్స్‌ను ఆమ‌డ దూరం త‌రిమేయ‌వ‌చ్చట‌..!

Alzheimers : ఒక కప్పు వేడివేడి కాఫీ లేకుండా రోజును ప్రారంభించలేని వాళ్లలో మీరు కూడా ఒకరా..? ఉదయాన్నే కాఫీ లేకపోతే మీరు ఉక్కిరిబిక్కిరి అవుతారా..? అయితే ఇటీవ‌ల జ‌రిగిన ఓ అధ్యయ‌నం మీకొక శుభ‌వార్త తెలియ‌జేస్తున్నది. ఎక్కువ మొత్తంలో కాఫీ తీసుకోవ‌డంవ‌ల్ల అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుందని తాజా పరిశోధనలో తేలింది. ఈ నూత‌న‌ పరిశోధన ఫలితాలు ‘ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్ జర్నల్’లో ప్రచురిత‌మ‌య్యాయి. ఈ ప‌రిశోధ‌న గురించి స‌మ‌గ్రంగా తెలుసుకుందాం..

ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయానికి చెందిన‌ పరిశోధకులు.. కాఫీ ఎక్కువ‌గా తీసుకోవడం జ్ఞాప‌క‌శ‌క్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంద‌నే విష‌యంలో ఒక ద‌శాబ్దకాలంపాటు 200 కంటే ఎక్కువ మందిపై అధ్యయ‌నం చేశారు. కాఫీకి, అల్జీమ‌ర్స్ వ్యాధి ల‌క్షణాల‌కు మ‌ధ్య సంబంధం ఉన్నట్లు తేలింద‌ని ఈ రిసెర్చ్‌కు నేతృత్వం వ‌హించిన డాక్టర్ స‌మంతా గార్డెన‌ర్ చెప్పారు.

ఎక్కువ కాఫీ తీసుకునే అల‌వాటు ఉండి, జ్ఞాప‌క‌శ‌క్తి లోపాలు లేనివాళ్లలో అల్జీమ‌ర్స్ ముప్పు చాలా త‌క్కువ‌గా ఉన్నద‌ని తాజా అధ్యయ‌నంలో తేలిన‌ట్లు ప‌రిశోధ‌కులు తెలిపారు. ఎక్కువ కాఫీ తీసుకోవ‌డం అనేది మెద‌డు ప‌నితీరుకు సంబంధించి సానుకూల ఫ‌లితాల‌ను ఇచ్చింది. ప్రత్యేకించి ప్లానింగ్‌, స్వీయ నియంత్రణ‌, ఏకాగ్రత‌కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ విధుల మెరుగుకు కాఫీ బాగా దోహ‌ద‌పడుతుంద‌ని తేలింది.

సాధార‌ణంగా మెదడులో అమైలాయిడ్ ప్రొటీన్ అతిగా పోగుప‌డ‌టం అల్జీమ‌ర్స్ వ్యాధికి దారితీస్తుంది. అయితే కాఫీ అతిగా తాగేవాళ్ల మెదడులో అమైలాడ్ ప్రొటీన్ నిదానంగా పోగుప‌డుతుంద‌ని పరిశోధ‌న‌లో తేలింది. డాక్టర్ గార్డెనర్ మాట్లాడుతూ.. దీనిపై మ‌రింత లోతైన ప‌రిశోధ‌న జ‌రుగాల్సిన అవ‌స‌రం ఉన్నప్పటికీ.. అల్జీమ‌ర్స్ వ్యాధి రాక‌ను కాఫీ ఆలస్యం చేస్తుంద‌నేది మాత్రం తాజా ప‌రిశోధ‌న‌తో స్పష్టమైంద‌న్నారు. ప్రస్తుతం ఎలాంటి ల‌క్షణాలు కనిపించ‌కుండా మేధో క్షీణ‌త ప్రమాదం పొంచి ఉన్నవారికి ఎక్కువ‌గా కాఫీ తీసుకోవడం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని గార్డెన‌ర్ చెప్పారు.