WI vs NED:వాట్ ఏ మ్యాచ్.. సూపర్ ఓవర్‌లో విండీస్‌పై స్టన్నింగ్ విజయం సాధించిన పసికూన
WI vs NED: మొన్నటి వరకు ఐపీఎల్ క్రికెట్‌లో తడిసి ముద్దైన ప్రేక్షకులకి ఇప్పుడు వన్డే ప్రపంచ కప్ 2023 క్వాలిఫైయర్ మ్యాచ్‌లు కూడా మంచి మజాని అందిస్తున్నాయి. పసికూన అనుకున్న టీంలు భారీ టార్గెట్స్ ని కూడా చేదిస్తూ పెద్ద టీంలకి సవాల్ విసురుతున్నాయి. సోమవారం వెస్టిండీస్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చెమటలు పట్టించింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్.. టై కావడంతో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం వచ్చింది. అయితే నెదర్లాండ్ […]
WI vs NED: మొన్నటి వరకు ఐపీఎల్ క్రికెట్‌లో తడిసి ముద్దైన ప్రేక్షకులకి ఇప్పుడు వన్డే ప్రపంచ కప్ 2023 క్వాలిఫైయర్ మ్యాచ్‌లు కూడా మంచి మజాని అందిస్తున్నాయి. పసికూన అనుకున్న టీంలు భారీ టార్గెట్స్ ని కూడా చేదిస్తూ పెద్ద టీంలకి సవాల్ విసురుతున్నాయి. సోమవారం వెస్టిండీస్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చెమటలు పట్టించింది.
చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్.. టై కావడంతో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం వచ్చింది. అయితే నెదర్లాండ్ జట్టులో ఆడుతున్న మన తెలుగు తేజం అద్భుతమైన సెంచరీతో ఆ జట్టుకి గొప్ప విజయాన్ని అందించాడు.నిడమనూరు బ్యాటింగ్ పై ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

హరారేలోని తకాషింగా స్పోర్ట్స్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందు బ్యాటింగ్‌కి దిగిన వెస్టిండీస్ జట్టుకు బ్రెండన్ కింగ్ (76), జాన్సన్ చార్లెస్ (54) మంచి శుభారంభం అందించారు. ఆ తర్వాత, షాయ్ హోప్, నికోలస్ పూరన్ గేమ్ వేగాన్ని పెంచారు.
నికోలస్ పూరన్ చెలరేగి ఆడి కేవలం 65 బంతుల్లో 104 పరుగులు (9 ఫోర్లు, 6 సిక్స్‌లు) చేయడంతో వెస్టిండీస్ జట్టుకు భారీ స్కోరు దక్కేలా చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్ కీమో పాల్ (46 పరుగులు, 25 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ (47 పరుగులు, 38 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేయడంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 374 పరుగులు చేసింది.
ఇక 375 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు.. దూకూడుగా ఆడుతూ వచ్చింది. తెలుగుతేజం తేజ నిడమనూరి కేవలం 76 బంతుల్లో 111 రన్స్ (11 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
ఆయనతో పాటు స్కాట్ ఎడ్వర్డ్స్ (67 పరుగులు, 47 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్స్), వ్యాన్ బీక్ (28 పరుగులు, 14 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్స్), ఆర్యన్ దత్ (16 పరుగులు, 9 బంతుల్లో, 2 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి నెదర్లాండ్ విజయం అంచు వరకు తీసుకెళ్లారు. 50 ఓవర్లకి నెదర్లాండ్స్ జట్టు కూడా 374 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది.
దీంతో సూపర్ ఓవర్ ఆడించగా, ముందుగా బ్యాటింట్ చేసిన నెదర్లాండ్స్ ఆరు బంతులలో 30 పరుగులు చేయగా, వెస్టిండీస్ 8/2 పరుగులు చేసి పరాజయం మూటగట్టుకుంది.జింబాబ్వేతో ఓడిన విండీస్ ఓడిన విండీస్ ఇప్పుడు నెదర్లాండ్స్ చేతిలో కూడా ఓడి 2023 వరల్డ్ కప్ క్వాలిఫై అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.
                    
                                    X
                                
                        Google News
                    
                        Facebook
                    
                        Instagram
                    
                        Youtube
                    
                        Telegram