మంత్రి సీతక్కకు ప్రతిష్ఠాత్మక ‘VVGF’ సదస్సుకు ఆహ్వానం
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్కకు అంతర్జాతీయ స్థాయి మహిళా నాయకత్వ వేదిక ‘వైటల్ వాయిసెస్ గ్లోబల్ ఫెలోషిప్ (VVGF)’ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం అందింది.
హైదరాబాద్, నవంబర్ 03(విధాత): పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్కకు అంతర్జాతీయ స్థాయి మహిళా నాయకత్వ వేదిక ‘వైటల్ వాయిసెస్ గ్లోబల్ ఫెలోషిప్ (VVGF)’ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం అందింది.
ప్రపంచవ్యాప్తంగా మహిళా నాయకత్వం, సామాజిక మార్పు, ప్రజా సేవా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న నాయకులను ఈ సదస్సుకు ఆహ్వానిస్తారు. మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం సీతక్క చేసిన కృషిని గుర్తిస్తూ నిర్వాహకులు ఈ గౌరవాన్ని అందించారు. ఈ నేపద్యంలో మంత్రి సీతక్క నెదర్లాండ్స్ కి ఆదివారం నాడు చేరుకున్నారు.
నెదర్లాండ్స్ లో జరుగుతున్న ఈ సదస్సులో ప్రపంచంలోని పలు దేశాల మహిళా నాయకులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నెదర్లాండ్స్ కి చేరుకున్న సీతక్క తెలంగాణలో అమలవుతున్న మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలను, గ్రామీణ అభివృద్ధి చర్యలను అంతర్జాతీయ వేదికపై వివరించనున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram