కౌంటింగ్ వేళ వైన్స్‌ల బంద్‌

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్‌లను మూసివేయాలని నిర్ణయించారు

  • By: Somu    latest    Dec 02, 2023 11:03 AM IST
కౌంటింగ్ వేళ వైన్స్‌ల బంద్‌

విధాత: అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్‌లను మూసివేయాలని నిర్ణయించారు. కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా ఎక్సైజ్, పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైన్ షాపు యజమానులకు నోటీసులు జారీ చేశారు.


మూసీవేత ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. హైద్రాబాద్‌లో వైన్ షాపులు మూసివేయాలని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్యా ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ర్యాలీల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుండా చర్యలు చేపట్టామన్నారు.