ఇప్పటికే ముగ్గురు అమ్మాయిలు.. ఒకే కాన్పులో మరో ముగ్గురు మగ శిశువులకు జన్మ
Rajasthan | ఇప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు. కానీ మగ పిల్లాడిని కనాలని ఆమె కోరిక. ఇందుకోసం నాలుగోసారి గర్భం ధరించింది. ఒక అబ్బాయి కోసం ప్రయత్నిస్తే.. ఏకంగా ముగ్గురు మగపిల్లలు జన్మించారు. దీంతో ఆ ఇంట సంతోషం వెల్లివిరిసింది. కుటుంబ సభ్యులంతా పండుగ చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ దుంగార్పూర్ జిల్లాలోని హీరకేడి పిండవాల్ గ్రామానికి చెందిన జయంతిలాల్, బడు దంపతులకు వరుసగా ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. కొడుకు పుట్టలేదని ఒక బాధ ఆ దంపతుల్లో […]

Rajasthan | ఇప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు. కానీ మగ పిల్లాడిని కనాలని ఆమె కోరిక. ఇందుకోసం నాలుగోసారి గర్భం ధరించింది. ఒక అబ్బాయి కోసం ప్రయత్నిస్తే.. ఏకంగా ముగ్గురు మగపిల్లలు జన్మించారు. దీంతో ఆ ఇంట సంతోషం వెల్లివిరిసింది. కుటుంబ సభ్యులంతా పండుగ చేసుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ దుంగార్పూర్ జిల్లాలోని హీరకేడి పిండవాల్ గ్రామానికి చెందిన జయంతిలాల్, బడు దంపతులకు వరుసగా ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. కొడుకు పుట్టలేదని ఒక బాధ ఆ దంపతుల్లో ఉండేది. దీంతో కొడుకును కనాలనే ఉద్దేశంతో నాలుగోసారి ఆమె గర్భం ధరించింది.
బడుకు నెలలు నిండటంతో నవంబర్ 26వ తేదీన ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. సాగ్వారాలోని పండిట్ దీన్‌దయాళ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజున బడు ముగ్గురు మగపిల్లలకు జన్మించింది. ఇక జయంతిలాల్, బడు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒక అబ్బాయి కోసం ప్రయత్నిస్తే ముగ్గురు మగ శిశువులు జన్మించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఒక్కొక్కరు కిలో బరువుతో..
ముగ్గురు మగ పిల్లలు ఒక్కొక్కరు కేవలం కిలో బరువుతో పుట్టారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో కృత్రిమంగా ఆక్సిజన్ అందించారు. పాలు తాగడానికి కూడా ఇబ్బంది పడటంతో.. పైపుల ద్వారా పాలు తాగించారు. దాదాపు నెల రోజుల పాటు తల్లీబిడ్డలకు వైద్యం అందించారు. ఇప్పుడు తల్లీబిడ్డలు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.