మహిళల టీ20 ప్రపంచకప్‌.. టీమిండియాకు మొదటి పరాజయం

విధాత: మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు మొదటి పరాజయం ఎదురైంది. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్‌ చేతిలో 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేధనలో బరిలోకి దిగిన భారత్‌ 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (52) హాఫ్‌ సెంచరీ, రిచా ఘోష్‌ (47 నాటౌట్‌) పరుగులతో రాణించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో […]

  • By: krs |    latest |    Published on : Feb 18, 2023 5:50 PM IST
మహిళల టీ20 ప్రపంచకప్‌.. టీమిండియాకు మొదటి పరాజయం

విధాత: మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు మొదటి పరాజయం ఎదురైంది. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్‌ చేతిలో 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య ఛేధనలో బరిలోకి దిగిన భారత్‌ 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (52) హాఫ్‌ సెంచరీ, రిచా ఘోష్‌ (47 నాటౌట్‌) పరుగులతో రాణించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలిచిన ఇంగ్లాండ్‌కు సెమీస్‌ బెర్తు దాదాపు ఖరారైంది. భారత్‌ తన చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో ఫిబ్రవరి 20న తలపడనున్నది.