World Happiness Report | భారతీయులు సంతోషంగా లేరా..? వరల్డ్‌ హ్యాపీనెస్‌లో రిపోర్ట్‌లో అట్టడుగున భారత్‌..!

World Happiness Report | యూఎన్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్‌ నెట్‌వర్క్‌ విడుదల చేసిన వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్ట్‌లో భారత్‌ అట్టడుగున నిలిచింది. గతేడాదితో పోలిస్తే పరిస్థితి కొంచెం మెరుగుపడి 126వ స్థానంలో నిలిచింది. గతేడాది 136వ స్థానంలో ఉన్నది. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్‌ (Finland ) నిలిచింది. ఈ జాబితాలో ఫిన్లాండ్‌ మొదటి స్థానంలో నిలువడం ఇది వరుసగా ఆరోసారి. యూఎన్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్‌ నెట్‌వర్క్‌ మార్చి 20న ‘వరల్డ్‌ […]

World Happiness Report | భారతీయులు సంతోషంగా లేరా..? వరల్డ్‌ హ్యాపీనెస్‌లో రిపోర్ట్‌లో అట్టడుగున భారత్‌..!

World Happiness Report | యూఎన్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్‌ నెట్‌వర్క్‌ విడుదల చేసిన వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్ట్‌లో భారత్‌ అట్టడుగున నిలిచింది. గతేడాదితో పోలిస్తే పరిస్థితి కొంచెం మెరుగుపడి 126వ స్థానంలో నిలిచింది. గతేడాది 136వ స్థానంలో ఉన్నది. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్‌ (Finland ) నిలిచింది. ఈ జాబితాలో ఫిన్లాండ్‌ మొదటి స్థానంలో నిలువడం ఇది వరుసగా ఆరోసారి. యూఎన్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్‌ నెట్‌వర్క్‌ మార్చి 20న ‘వరల్డ్‌ హ్యీపీనెస్‌ డే’ సందర్భంగా జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితాలో ఫిన్లాండ్‌ తొలిస్థానంలో నిలువగా.. తాలిబాన్ల ఆధ్వర్యంలోని ఆఫ్ఘనిస్తాన్‌ చివరిస్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా.. వరుసగా నాలుగో సంవత్సరం యూకీ హ్యీపీనెస్‌ ర్యాంకు పడిపోయింది. ఈ నివేదికను అనేక మంది ఆర్థికవేత్తలు రూపొందించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ రిచర్డ్ లెర్డ్, కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్స్ ఇందులో భాగస్వాములయ్యారు. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ తొలిసారిగా పదేళ్ల కిందట అంటే 2012లో విడుదలైంది. రిపోర్ట్ ప్రకారం.. భారత్‌ 2020-2022లో మూడేళ్ల సగటు ఆధారంగా హ్యాపీనెస్ ర్యాంకింగ్స్‌లో 126వ స్థానంలో ఉన్నది.

భారతదేశం సగటు జీవిత మూల్యాంకన స్కోరు 4.036. మరో విషయం ఏంటంటే.. భారత్‌ కంటే మన పొరుగున ఉన్న దేశాలు ఈ జాబితాలో ముందు వరుసలో నిలిచాయి. పాక్‌ 108వ ర్యాంకులో నిలువగా.. శ్రీలంక 112, బంగ్లాదేశ్‌ 118 ర్యాంకులో నిలిచాయి. నేపాల్‌ 78వ ర్యాంకు, చైనా 64వ స్థానంలో నిలిచాయి. జాబితాలో టాప్‌ టెన్‌లో ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌, ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌, స్వీడన్‌, నార్వే, స్విట్లర్లాండ్‌, లక్సెంబర్గ్‌, న్యూజిలాండ్‌ నిలిచాయి. ఇదిలా ఉండగా.. ఈ జాబితాలో రష్యా 70, ఉక్రెయిన్‌ 92వ స్థానంలో ఉన్నాయి.