ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం.. ప్లేయర్ల రియాక్షన్ ఇదీ.. వీడియో
WPL Auction | తొలిసారిగా నిర్వహిస్తున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ముంబయిలో సోమవారం జరిగింది. వేలంలో భారత స్టార్ల క్రికెటర్లపై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి. ఏడుగురు ఆటగాళ్లు రూ.2కోట్లకుపైగా అమ్ముడుపోయారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ఖరీదైన క్రికెటర్‌గా స్మృతి మంధానా నిలిచింది. రూ.3.40కోట్లకు ఆర్‌సీబీ దక్కించుకుంది. అదే సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే గార్డనర్, ఇంగ్లండ్‌కు చెందిన నటాలీ స్కివర్ రూ.3.20 కోట్లు ధర పలికారు. నటాలీని ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేయగా.. […]

WPL Auction | తొలిసారిగా నిర్వహిస్తున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ముంబయిలో సోమవారం జరిగింది. వేలంలో భారత స్టార్ల క్రికెటర్లపై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి. ఏడుగురు ఆటగాళ్లు రూ.2కోట్లకుపైగా అమ్ముడుపోయారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ఖరీదైన క్రికెటర్‌గా స్మృతి మంధానా నిలిచింది. రూ.3.40కోట్లకు ఆర్‌సీబీ దక్కించుకుంది. అదే సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే గార్డనర్, ఇంగ్లండ్‌కు చెందిన నటాలీ స్కివర్ రూ.3.20 కోట్లు ధర పలికారు. నటాలీని ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేయగా.. గార్డనర్‌ను గుజరాత్ జెయింట్ కొనుగోలు చేసింది.
ఏడుగురికి రూ.2కోట్లపైనే..
ఆల్ టైమ్ అత్యంత ఖరీదైన టాప్ 10 ప్లేయర్లలో భారత్‌కు చెందిన ఏడుగురు ఉన్నారు. ఇందులో స్మృతి మంధానాతో పాటు దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, హర్మన్‌ప్రీత్ కౌర్ ఉన్నారు. టీ20 ప్రపంచకప్ సందర్భంగా భారత మహిళల జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉంది. ఆదివారం పాక్‌పై జట్టు అద్భుతమైన విషయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన వేలాన్ని ఆటగాళ్లు వీక్షించారు. ఓ వైపు ఆటగాళ్ల కోసం వేలం జరుగుతుండగా.. మొదట వేలానికి స్మృతి మంధానా పేరును ప్రకటించగా.. భారత క్రీడాకారులు చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. రూ.3.40కోట్లకు ఆర్‌సీబీ కొనుగోలు చేయడంతో మిగతా క్రీడాకారులంతా స్మృతిని అభినందించారు. అదే సమమంలో హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ముంబయి దక్కించుకోవడంతో శుభాకాంక్షలు తెలిపారు.
ముంబయి ఇండియన్స్‌కు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్..!
ప్రస్తుతం భారత మహిళల జట్టుకు కెప్టెన్‌గా ఉన్న హర్మన్ ప్రీత్‌కౌర్‌ను ముంబయి ఇండియన్స్ వేలంలో రూ.1.80కోట్లకు దక్కించుకుంది. ముంబయి ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. భారత పురుషుల జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ సైతం ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తుండడం విశేషం. అదే సమయంలో స్మృతి మంధానాకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. వేలం తర్వాత పలువురు ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేశారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వచ్చే నెల మార్చిలో ముంబయిలో జరుగనున్నది.
[09:36, 14/02/2023] Pradeep. Nt:
Wholesome content alert!