Sankranti son-in-law feast 290 dishes| సంక్రాంతి అల్లుడికి 290వంటకాలతో కొత్త రికార్డు!
సంక్రాంతి అల్లుళ్ల విందులో రకరకాల ప్రత్యేకతలతో కూడి వందల రకాల వంటకాలను వడ్డించడంలో గోదావరి జిల్లాల ఇప్పటిదాక తమ ప్రత్యేకతను చాటాయి. అయితే ఈ ఏడాది సంక్రాంతి పండుగకు మాత్రం గోదారోళ్ల కొత్త అల్లుళ్ల విందుల రికార్డులను తెనాలి, నర్సీపట్నంలు సొంతం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.
అమరాతి : ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ సందర్బంగా కొత్త అల్లుళ్లకు లభించే రాచమర్యాదలు ఏటా కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. సంక్రాంతి అల్లుళ్ల విందులో రకరకాల ప్రత్యేకతలతో కూడి వందల రకాల వంటకాలను వడ్డించడంలో గోదావరి జిల్లాల ఇప్పటిదాక తమ ప్రత్యేకతను చాటాయి. అయితే ఈ ఏడాది సంక్రాంతి పండుగకు మాత్రం గోదారోళ్ల కొత్త అల్లుళ్ల విందుల రికార్డులను తెనాలి, నర్సీపట్నంలు సొంతం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.
నర్సీపట్నంలో కొత్త అల్లుడికి 290 రకాల వంటకాలతో సంక్రాంతి విందు
సంక్రాంతి పండుగ సందర్భంగా అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుడికి విశాఖపట్నం నర్సీపటనం మున్సిపాలిటీలోని శాంతినగర్‌లో అత్తింటి వారు ఏకంగా 290రకాల వంటకాలతో అద్బుత విందు ఇచ్చారు. రమేశ్ కుమార్, కళావతి దంపతులు సంక్రాంతి పండుగకు తమ ఇంటికి వచ్చిన కొత్త అల్లుడు శ్రీహర్షకు, కూతురు లక్ష్మీనవ్యలకు గోదారోళ్ల శైలిలో కంగా 290 పండి వంటకాలతోవిందు ఏర్పాటు చేశారు. అల్లుడు శ్రీ హర్షకు 29ఏళ్లు కావడంతో .. గుర్తుగా 290 రకాల పిండి వంటలతో భారీ విందు ఏర్పాటు చేశారు.
భోజనానికి కూర్చున్న అల్లుడి కళ్ల ముందు అన్ని రకాల వంటకాలు కనిపించేసరికి ఆయన ఆశ్చర్యంలో మునిగిపోయారు. గారెలు, బూరెలు, అరిసెలు వంటి సాంప్రదాయ పిండివంటల నుంచి మొదలుకుని ఆధునిక వంటకాల వరకు అన్నీ ఆ విస్తరిలో కొలువుదీరడంతో వాటిని రుచి చూడటంలో కొత్త అల్లుడు, కూతురు తిప్పలు నవ్వులు తెప్పించాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇదే సంక్రాంతి పండుగ సందర్బంగా తెనాలిలో మురళికృష్ణ, మాధవీలత దంపతులు అల్లుడు శ్రీదత్త, కుమార్తె మౌనికలకు 158రకాల వంటలతో విందు ఇచ్చారు. ఇదే పండుగ వేళ ఆ రికార్డును నర్సీపట్నం రమేష్ కుమార్ కళావతి దంపతులు 290రకాలల వంటకాలతో అధిగమించడం విశేషం.
పండుగ స్పెషల్.. అల్లుడికి 290 రకాల వంటకాలతో విందు
విశాఖపట్నం నర్సీపటనం మున్సిపాలిటీలోని శాంతినగర్‌లో వెలుగు చూసిన ఘటన
సంక్రాంతి సందర్భంగా.. తమ కొత్త అల్లుడు శ్రీహర్షకు ఘన స్వాగతం పలికిన రమేశ్ కుమార్, కళావతి దంపతులు
గోదారోళ్ల శైలిలో.. ఏకంగా 290 పండి వంటకాలతో అల్లుడికి విందు… pic.twitter.com/X8YMUXHwkv
— PulseNewsBreaking (@pulsenewsbreak) January 15, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram