Amalapuram Tesla car| అమలాపురంలో టెస్లా కారు క్రేజ్ .. సెల్పీలతో జనం సందడి

సంక్రాంతి వేడుకల వేళ ఆంధ్రప్రదేశ్ కు చెందిన అమలాపురంలో టెస్లా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారు సందడి చేసింది. భారత్‌లో అత్యంత అరుదుగా కనిపించే ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ కారును చూసేందుకు స్థానికులు భారీగా ఎగబడ్డారు. ప్రజలు ఈ క్రేజీ కారుతో సెల్ఫీలు దిగడంలో పోటీ పడ్డారు.

Amalapuram Tesla car| అమలాపురంలో టెస్లా కారు క్రేజ్ .. సెల్పీలతో జనం సందడి

అమరావతి : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా కార్లకు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. అతి ఖరీదైన విలాసవంతమైన టెస్లా కారు ధరలు సంపన్నవర్గాలకే అందుబాటులో ఉండటంతో భారత్ లో వాటి కొనుగోలు అంతంత మాత్రంగానే సాగుతుంది. ప్రస్తుతం ఇండియాలో టెస్లా మోడల్ Y కార్లు అందుబాటులో ఉన్నాయి.

అయితే తాజాగా సంక్రాంతి వేడుకల వేళ ఆంధ్రప్రదేశ్ కు చెందిన అమలాపురంలో టెస్లా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారు సందడి చేసింది. భారత్‌లో అత్యంత అరుదుగా కనిపించే ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ కారును చూసేందుకు స్థానికులు భారీగా ఎగబడ్డారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిత్య రామ్ సంక్రాంతి వేడుకల కోసం తన కొత్తగా కొనుగోలు చేసిన టెస్లా కారులో గ్రామానికి రావడంతో అమలాపురం వీధులన్నీ సందడిగా మారాయి. ప్రజలు ఈ క్రేజీ కారుతో సెల్ఫీలు దిగడంలో పోటీ పడ్డారు. టెస్లా సెల్పీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు.