Pawan Kalyan | నెట్‌ఫ్లిక్స్‌లో పవర్ స్టార్ హంగామా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ డిజిటల్ డీల్‌తో కొత్త బజ్

Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు మరో కీలక అప్‌డేట్‌తో వార్తల్లో నిలిచింది.

  • By: sn |    movies |    Published on : Jan 16, 2026 11:35 AM IST
Pawan Kalyan | నెట్‌ఫ్లిక్స్‌లో పవర్ స్టార్ హంగామా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ డిజిటల్ డీల్‌తో కొత్త బజ్

Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు మరో కీలక అప్‌డేట్‌తో వార్తల్లో నిలిచింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ థియేటర్లకు ముందే డిజిటల్ రంగంలో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది.

తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జనవరి 16న నెట్‌ఫ్లిక్స్ తమ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించడంతో, పవన్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం రెట్టింపు అయింది. థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఈ చిత్రం తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

నెట్‌ఫ్లిక్స్ నిర్వహిస్తున్న “నెట్‌ఫ్లిక్స్ పండగ” క్యాంపెయిన్‌లో భాగంగా ఉస్తాద్ భగత్ సింగ్ను ప్రధాన ఆకర్షణగా ప్రకటించడం గమనార్హం. “న్యాయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు… అతనికి కూడా కాదు” అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో చేసిన అనౌన్స్‌మెంట్ సినిమా టోన్‌ను స్పష్టంగా చూపిస్తోంది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తమే చెల్లించినట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ తాజా బ్లాక్‌బస్టర్ ఓజీ విజయంతో ఆయన మార్కెట్ మరింత పెరగడం ఈ డీల్‌కు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఓటీటీ రైట్స్‌కు సుమారు రూ.80 నుంచి రూ.100 కోట్ల వరకు ఒప్పందం కుదిరిందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

సినిమా విషయానికి వస్తే, పవన్ కల్యాణ్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో గబ్బర్ సింగ్తో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన పవన్–హరీష్ శంకర్ జోడీ మళ్లీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రం 2026 ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశముందని సమాచారం. మొత్తంగా, ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లలోనే కాదు… ఓటీటీలో కూడా పవర్ స్టార్ బ్రాండ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా మారనుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.