Madurai jasmine price| వండర్ .. కిలో మల్లెపూలు రూ.6వేలు !
సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి రోజున భోగి మంటలు కాచుకోవడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. అయితే తమిళనాడు మధురైలో మాత్రం అనూహ్యంగా భోగి మంటల స్థానంలో సువాసనలతో మత్తెక్కించాల్సిన మల్లెపూలు సెగలు రేపాయి. సంక్రాంతి పండుగ రోజున మధురై పూల మార్కెట్ లో మల్లెపూలకు భారీగా డిమాండ్ పెరుగడంతో కిలో మల్లెపూలు రూ. 6000కుపెరిగాయి.
విధాత : సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి రోజున భోగి మంటలు కాచుకోవడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. అయితే తమిళనాడు మధురైలో మాత్రం అనూహ్యంగా భోగి మంటల స్థానంలో సువాసనలతో మత్తెక్కించాల్సిన మల్లెపూలు సెగలు రేపాయి. అయితే మంటలతో కాకుండా పెరిగిన ధరలతో మల్లెపూలు నుగోలుదారులకు వేడి పుట్టించడం విశేషం.
సంక్రాంతి పండుగ రోజున మధురై పూల మార్కెట్ లో మల్లెపూలకు భారీగా డిమాండ్ పెరుగడంతో కిలో మల్లెపూలు రూ. 6000కుపెరిగాయి. మల్లెపూల ధరల భారీ పెరుగుదలపై సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే అదనుగా పూల వ్యాపారులు లాభాలు పొందుతున్నారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో లక్ష్మీ పూజలు, గోదా కల్యాణాలు, అయ్యప్ప పూజలు వంటి వరుస శుభకార్యాల నేపథ్యంలో మల్లెపూలకు భారీగా డిమాండ్ పెరిగింది. సాధారణంగా కిలో రూ. 1,000 నుండి రూ. 2,000 మధ్య ఉండే మల్లేపూల ధర ఒక్కసారిగా రూ. 6,000 పైకి చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో గిరాకీ మేరకు కిలో రూ. 10,000 కు కూడా విక్రయిస్తున్నారు. ఎంత ధర పెరిగిన ఎగుమతి జరిగే మధురై మల్లి రకం పూలకు మాత్రం డిమాండ్ తగ్గలేదు. చలి వాతావరణం నేపథ్యంలో మల్లెపూల దిగుబడి తగ్గి డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో పూల ధరలకు రెక్కలు వచ్చాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా రోజుకు 10 టన్నుల మల్లెపూలు వచ్చే మార్కెట్‌కు ప్రస్తుతం కేవలం వందల కిలోలు మాత్రమే వస్తున్న తీరు పూల దిగుబడి తగ్గుదలకు నిదర్శనమంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram