AP Sankranti recording dances controversy| శృతి మించిన ఏపీ సంక్రాంతి రికార్డింగ్ డాన్స్ లు !

ఏపీలో సంక్రాంతి సందర్బంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రికార్డింగ్ డాన్స్ ల ప్రదర్శనలు శృతి మించడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతుంది. పండగ అంటే మన సంప్రదాయాలు, సాంస్కృతిక ప్రదర్శలనలు, కుటుంబాలతో కలిసి ఆనందించాల్సిన వేడుకలు అన్న పరిస్థితుల నుంచి ఇదేం సంస్కృతి..ఇదేం విజన్ అనే విమర్శల స్థాయికి చేరిపోవడం చర్చనీయాంశమైంది.

AP Sankranti recording dances controversy| శృతి మించిన ఏపీ సంక్రాంతి రికార్డింగ్ డాన్స్ లు !

అమరావతి : ఏపీలో సంక్రాంతి సందర్బంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రికార్డింగ్ డాన్స్ ల ప్రదర్శనలు శృతి మించడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతుంది. పండగ అంటే మన సంప్రదాయాలు, సాంస్కృతిక ప్రదర్శనలు , కుటుంబాలతో కలిసి ఆనందించాల్సిన వేడుకలు అన్న పరిస్థితుల నుంచి ఇదేం సంస్కృతి..ఇదేం విజన్ అనే విమర్శల స్థాయికి చేరిపోవడం చర్చనీయాంశమైంది. రికార్డింగ్ డాన్స్ లు హద్దులు దాటిపోయి.. అశ్లీల నృత్యాలుగా మారిపోవడం సంక్రాంతి వేడుకలను అప్రతిష్ట పాలు చేసేదిగా మారింది.

ఆంధ్రాలో సంక్రాంతి సంబరాలలో రికార్డింగ్ డాన్సులు, కోళ్ల పందాలు, ఎండ్ల పందాలు, పేకాట, జూదం, క్యాసినో వంటివి బెట్టింగ్ గేమ్ లు సర్వసాధారణం. వాటిపై నిషేధం ఉన్నా..సంక్రాంతి సందర్బంగా “సాంప్రదాయం” పేరుతో యధేచ్చగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. దీంతో పండుగంటే కుటుంబాల బంధాలు, ఆనందాల వేడుకల స్థానంలో అవన్ని రాజ్యమేలుతున్నాయి. ఉమ్మడి.. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలు ఈ సంక్రాంతికి మునుపటిలాగే కోడిపందాలు, పేకాట, జూదానికి ప్రధాన అడ్డాలుగా మారాయి. అర్ధరాత్రి దాకా అశ్లీల నృత్యాలతో హోరెత్తించారు. పందాలు, రికార్డింగ్ డాన్స్ ల గలీజ్ దందాలు రూ.2వేల కోట్ల వరకు సాగాయని తెలుస్తుంది.

వివాదాన్ని రాజేసిన గోగన్న మట్టం రికార్డింగ్ డాన్స్

రాజోలు నియోజకవర్గం గోగన్నమట్టం గ్రామంలో రికార్డింగ్ డాన్స్ కార్యక్రమం జరిగిన తీరు సోషల్ మీడియాలో వివాదస్పమైంది. నిర్వాహకవర్గంలోని జనసేన ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ ముఖ్య అనుచరుడు డాన్సర్లతో అసభ్య ప్రదర్శన కోరుతూ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతున్న ఏపీ ప్రతిపక్ష రాజకీయ పార్టీల సోషల్ మీడియా వైరల్ చేస్తుంది. సభ్య సమాజం తలదించుకునేలా ఇలాంటి అసభ్యకర డాన్సులకి పరిమిషన్ ఇచ్చింది ఎవర్రా స్వామి అటూ విమర్శలు సంధిస్తున్నారు. గలీజ్ దందాను కాస్తా లీగలైజ్ చేశారా అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.  అయితే ఈ వ్యవహారాలు కొత్తవేమి కావని..ఏ ప్రభుత్వాలు ఉన్నా పండుగ వేళ్లలో సాధారణంగా సాగిపోతుంటాయని అధికార పార్టీ వర్గాలు ఎదురుదాడి చేస్తున్నాయి.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, జూదంపై కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆ జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు కట్టడి చేయాలని.. అవసరమైతే సెక్షన్‌ 144 అమలు చేయాలని సూచించింది. తమ ఆదేశాలు ఉల్లంఘించి కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే దాడులు చేసి డబ్బును సీజ్‌ చేయాలని కూడా ఆదేశించింది. అయితే అధికార పార్టీల రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసులు వాటిని చూసిచూడనట్లుగా వదిలేయడంతో..అలుసుగా తీసుకున్న నిర్వాహకులు పలుచోట్ల పందాలు, రికార్డింగ్ డాన్స్ ల నిర్వహణలో హద్దులు దాటిపోవడం విమర్శలకు దారితీసింది.