Wrestlers | మా పోరాటం ఆగదు.. కోర్టులో తేల్చుకుంటాం: రెజ్లర్లు
Wrestlers | రోడ్లపై కాదు.. కోర్టులో తేల్చుకుంటాం బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళనపై రెజ్లర్ల ప్రకటన న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై తమ పోరాటం కొనసాగుతుందని ఆయనపై ఆరోపణలు చేసిన రెజ్లర్లు స్పష్టం చేశారు. తమ పోరాటం రోడ్లపై కాదని, కోర్టులోనే తేల్చుకుంటామని పేర్కొన్నారు. రెజ్లర్లు తమ ఆందోళనను కొనసాగించేందుకు మళ్లీ ధర్నాలకు దిగుతారని భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ఈ మేరకు వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా […]

Wrestlers |
- రోడ్లపై కాదు.. కోర్టులో తేల్చుకుంటాం
- బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళనపై రెజ్లర్ల ప్రకటన
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై తమ పోరాటం కొనసాగుతుందని ఆయనపై ఆరోపణలు చేసిన రెజ్లర్లు స్పష్టం చేశారు. తమ పోరాటం రోడ్లపై కాదని, కోర్టులోనే తేల్చుకుంటామని పేర్కొన్నారు.
రెజ్లర్లు తమ ఆందోళనను కొనసాగించేందుకు మళ్లీ ధర్నాలకు దిగుతారని భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ఈ మేరకు వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా ట్విట్టర్‌లో స్పందించారు.
బ్రిజ్‌భూషణ్‌పై చార్జిషీటు దాఖలు చేస్తామన్న హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇక తమ పోరాటం కోర్టుల్లో కొనసాగుతుందని తెలిపారు.
రెజ్లింగ్ ఫెడరేషన్‌ను సంస్కరించే విషయంలో హామీ ఇచ్చిన విధంగా ఎన్నికల ప్రక్రియ మొదలైందని, దీనిని ప్రభుత్వం నెరవేర్చడంపై ఎదురు చూస్తామని పేర్కొన్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్‌కు జూలై 11న ఎన్నికలు జరగాల్సి ఉన్నది. తమ ట్విట్టర్ పోస్టింగ్‌ల తర్వాత మళ్లీ ట్వీట్ చేసిన రెజ్లర్లు.. కొద్ది రోజులు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటామని తెలిపారు.