Warangal: చంటి పాపతో.. రికార్డు అసిస్టెంట్ పరీక్షకు హాజరైన బాలింత

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హైకోర్టు రిక్రూట్మెంట్ సంబంధించిన రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగ రాత పరీక్షకు చిండాలియ సంతోషి అనే బాలింత మంగళవారం హాజరయ్యారు. వరంగల్ శివనగర్ కు చెందిన చిండాలియ సంతోషి అనే బాలింత అంబులెన్స్‌లో చంటి పాపతో ఎగ్జామ్ సెంటర్‌కు హాజరైంది. మంగళవారం ఉదయం 7 గంటలకు వరంగల్ గోపాల్ స్వామి రోడ్డులోని విశిష్ట టెక్నాలజీలో ఈ పరీక్షకు హాజరయ్యారు. సంతోషి మాట్లాడుతూ తాను వారం రోజుల క్రితం చంటి పాపకు జన్మనిచ్చిందని తెలిపారు. […]

  • By: krs    latest    Apr 04, 2023 4:33 AM IST
Warangal: చంటి పాపతో.. రికార్డు అసిస్టెంట్ పరీక్షకు హాజరైన బాలింత

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హైకోర్టు రిక్రూట్మెంట్ సంబంధించిన రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగ రాత పరీక్షకు చిండాలియ సంతోషి అనే బాలింత మంగళవారం హాజరయ్యారు. వరంగల్ శివనగర్ కు చెందిన చిండాలియ సంతోషి అనే బాలింత అంబులెన్స్‌లో చంటి పాపతో ఎగ్జామ్ సెంటర్‌కు హాజరైంది.

మంగళవారం ఉదయం 7 గంటలకు వరంగల్ గోపాల్ స్వామి రోడ్డులోని విశిష్ట టెక్నాలజీలో ఈ పరీక్షకు హాజరయ్యారు. సంతోషి మాట్లాడుతూ తాను వారం రోజుల క్రితం చంటి పాపకు జన్మనిచ్చిందని తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా రాత పరీక్షకు వచ్చానని చిండాలియ సంతోషి అన్నారు. సర్జరీ అయి వారం రోజులు అవుతున్నట్లు వివరించారు.హైకోర్టు రిక్రూట్మెంట్ సంబంధించి రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాలని తపనతో ఉన్నట్టు ఆమె తెలిపారు.