Xiaomi 13T Pro | అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో షావోమీ 13T ప్రొ.. ధ‌ర కూడా అదే రేంజ్‌లో..!

Xiaomi 13T Pro | షావోమీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న షావోమీ 13 T ప్రో (Xiaomi 13T Pro) మోడ‌ల్‌కు సంబంధించి ప‌లు వివ‌రాలు నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇవి ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో టెక్ అభిమానుల్లో ఇప్పుడు దీని గురించే చ‌ర్చ న‌డుస్తోంది. షావోమీ 12 T ప్రోకు అప్‌డేటెడ్ వెర్ష‌న్‌గా 13 T ప్రోను తీసుకురానున్నామ‌ని సంస్థ గ‌తంలోనే వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు దీని ధ‌ర‌పై కొన్ని వార్తలు రాగా తొలి సారి […]

  • By: krs    latest    Sep 04, 2023 10:56 AM IST
Xiaomi 13T Pro | అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో షావోమీ 13T ప్రొ.. ధ‌ర కూడా అదే రేంజ్‌లో..!

Xiaomi 13T Pro |

షావోమీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న షావోమీ 13 T ప్రో (Xiaomi 13T Pro) మోడ‌ల్‌కు సంబంధించి ప‌లు వివ‌రాలు నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇవి ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో టెక్ అభిమానుల్లో ఇప్పుడు దీని గురించే చ‌ర్చ న‌డుస్తోంది.

షావోమీ 12 T ప్రోకు అప్‌డేటెడ్ వెర్ష‌న్‌గా 13 T ప్రోను తీసుకురానున్నామ‌ని సంస్థ గ‌తంలోనే వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు దీని ధ‌ర‌పై కొన్ని వార్తలు రాగా తొలి సారి స్పెసిఫికేష‌న్ల‌పై వివ‌రాలు అన‌ధికార‌కంగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

షావోమీ 13 T ప్రోను నాచు, ఊదా, నీలం రంగు వేరియంట్ల‌లో తీసుకురానున్నారు. ఫోన్ వెనుక భాగంలో ఎడ‌మ వైపు పైన కెమేరా యూనిట్ ఉంటుంది. ఇందులో లైకా ట్యూన్డ్ కెమేరాలు మూడు, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ లైట్‌ను పొందుప‌రిచారు. సెల్ఫీ కెమేరాను సాధార‌ణంగానే ఫోన్ మ‌ధ్య భాగంలో పైన ఇచ్చారు. దీనికి స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెస‌ర్ కాకుండా మీడియాటెక్‌ను ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ప్ర‌తికూల అంశాల్లో ఇదీ ఒక‌టి.

స్టోరేజీ విష‌యానికొస్తే 16 జీబీ ర్యాంతో పాటు 1 టీబీ అంత‌ర్గ‌త మెమోరీని ఇవ్వ‌నున్నారు. 13 టీ ప్రో డిస్‌ప్లే ఓఎల్ఈడీ సాంకేతిక‌త‌తో 6.67 అంగుళాల పొడ‌వుతో ఉంటుంద‌ని స‌మాచారం. 1.5కే రిజ‌ల్యుష‌న్‌, 144 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో దీని డిస్‌ప్లేను డిజైన్ చేశారు. కెమేరా క్వాలిటీ విష‌యానికొస్తే 50 మెగా పిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 707 సెన్స‌ర్‌ను ఉప‌యోగించారు.

13 మెగా పిక్సల్‌తో ఓమ్నీ విజ‌న్ ఓవీ 138 సెన్స‌ర్‌, అల్ట్రా వైడ్ లెన్స్ వ‌ల్ల కెమేరా క్వాలిటీ అద‌రగొట్టేస్తుంద‌ని టెక్ నిపుణులు అంటున్నారు. సెల్ఫీ కెమేరా 20 మెగా పిక్సల్ సామ‌ర్థ్యంతో సోనీ ఐఎంఎక్స్ 596 సెన్స‌ర్ సాయంతో ప‌నిచేస్తుంద‌ని తెలుస్తోంది.

5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 120 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సామ‌ర్థ్యం దీని సొంతం. ఐపీ 68 ప్ర‌మాణాల‌తో రానున్న షావోమీ 13 T ప్రోలో డ‌స్ట్‌, వాట‌ర్ రెసిస్టెంట్ సామ‌ర్థ్యం బ‌లంగా ఉండ‌నుంది. టెక్ నిపుణుల అంచనాల ప్ర‌కారం దీని ధ‌ర సుమారుగా రూ.71 వేల వ‌ర‌కు వెళ్లే అవ‌కాశ‌ముంది.