మరో బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్న రెడ్‌మీ..! ఫీచర్స్‌ డిటెయిల్స్‌ ఇవే..!

చైనాకు చెందిన ప్రముఖ సెల్‌ ఫోన్ల తయారీ కంపెనీ షావోమీ మరో సరికొత్త మోడల్‌ మొబైల్‌ను పరిచయం చేసింది.

మరో బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్న రెడ్‌మీ..! ఫీచర్స్‌ డిటెయిల్స్‌ ఇవే..!

విధాత‌: చైనాకు చెందిన ప్రముఖ సెల్‌ ఫోన్ల తయారీ కంపెనీ షావోమీ మరో సరికొత్త మోడల్‌ మొబైల్‌ను పరిచయం చేసింది. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తో పాటు అందుబాటులో ఉండే ధరకే ఫోన్‌ను తీసుకురాబోతున్నది. రెడ్‌మీ 13జీ 5జీ మోడల్‌ను మొబైల్‌ను మార్కెట్లో లాంచ్ చేస్తోంది. ఈ రెడ్‌మీ 13సీ మొబైల్‌లో 90హెచ్‌జడ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఉంటుంది. దాంతో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ రక్షణగా వస్తుంది.


ఇందులో మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100ప్లస్‌ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ సెటప్‌ ఉంటుంది. ఇందులో 8జీబీ రామ్‌, 256జీబీ స్టోరేజ్ సౌకర్యం ఉంటుంది. అదనంగా మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఒక టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. అలాగే ర్యామ్‌ను 16జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే వీలున్నది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 ఎంపీ ప్రైమరీ షూటర్‌తో ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉండగా.. ముందు వైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.


డిసెంబర్‌ 16న లాంచ్‌


ఇంకా మొబైల్‌ బ్లాక్, సిల్వర్, గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. సైడ్-మౌంటెడ్ క్విక్ అన్‌లాక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ ఫిక్స్‌ చేయగా.. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌, 18 వూక్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నది. ఈ రెడ్‌మీ 13సీ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు డిసెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. Mi.com, అమెజాన్, రెడ్‌మీ స్టోర్లలో కొనుగోలు చేసుకోవచ్చు.


ఈ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4జీబీ రామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ప్రత్యేక లాంచ్ ధర రూ.9,999గా నిర్ణయించింది. ఇక 6 జీబీ రామ్‌, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499 గా ఉన్నది. అదే సమయంలో టాప్ వేరియంట్ 8జీబీ రామ్‌, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.13,499 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభించనున్నది.