Summer | మూడు రోజుల పాటు దంచికొట్టనున్న ఎండలు.. జర జాగ్రత్త సుమా..!
Summer | రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు ఎండలు దంచికొట్టనున్నాయి. ఇప్పటికే భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో రాష్ట్ర ప్రజలు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Summer | రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు ఎండలు దంచికొట్టనున్నాయి. ఇప్పటికే భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో రాష్ట్ర ప్రజలు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఈ నెల 15వ తేదీ వరకు ఎండలు దంచికొట్టే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
15వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో 37 నుంచి 38 డిగ్రీలు, తూర్పు, ఉత్తర తెలంగాణలో 39-40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇక మార్చి 16, 17 తేదీల్లో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన తుపానులు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ఈ అకాల వర్షాలు మార్చి 23వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి తమ పంటలను కాపాడుకోవాలని సూచించారు.
ఇక బుధవారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో 38.7 డిగ్రీలు, భద్రాచలం జిల్లా కరకగూడెం, నల్లగొండ జిల్లా గుడిపల్లిలో 38.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram