Credit Card Rule | ఎస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా..? ఈ రూల్స్‌ మారాయని మీకు తెలుసా..?

ఇటీవలకాలం క్రెడిట్‌కార్డుల వినియోగం భారీగా పెరిగింది. ఎన్నో బ్యాంకులు వేతన జీవులకు కార్డులను జారీ చేస్తున్నాయి

Credit Card Rule | ఎస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా..? ఈ రూల్స్‌ మారాయని మీకు తెలుసా..?

Credit Card Rule | ఇటీవలకాలం క్రెడిట్‌కార్డుల వినియోగం భారీగా పెరిగింది. ఎన్నో బ్యాంకులు వేతన జీవులకు కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే, కార్డులపై ఆఫర్లు ఉండడంతో చాలామంది వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశీయ ఎస్‌ బ్యాంకు సైతం క్రెడిట్‌కార్డులను జారీ చేస్తున్నది. అయితే, బ్యాంకు కార్డులపై దేశీయ లాంజ్‌ యాక్సెస్‌ రూల్స్‌ను మార్చింది. ఇక నుంచి క్రెడిట్‌ కార్డు హోలర్డ్స్‌ లాంజ్‌లోకి ప్రవేశించాలంటే కనీసం రూ.10వేల వరకు ట్రాన్సాక్షన్స్‌ చేయాల్సి ఉంటుంది. లాంజ్ యాక్సెస్ సౌకర్యాలలో ఫుడ్‌, వైఫై, ఎయిర్‌పోర్ట్ లాంజ్, షవర్, లాంజ్ ఉంటాయి.


ఈ క్రమంలో రూల్స్‌ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఎస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌కార్డు కొత్త రూల్స్‌ ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. లాంజ్ యాక్సెస్ కావాలంటే.. మీరు డిసెంబర్ గత 21 నుంచి ఈ ఏడాది మార్చి 20 మధ్య నిర్ణీత మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేవలం కార్డు తీసుకోకుండా కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తేనే సౌకర్యాలు కల్పించేలా రూల్స్‌ను తీసుకువచ్చింది. ఎస్‌బ్యాంక్‌ పరిధిలోని ఎస్‌ మార్క్యూ, ఎస్‌ సెలెక్ట్‌, ఎస్‌ రిజర్వ్‌, ఎస్‌ ప్రెఫర్డ్‌, ఎస్‌ ఎలైట్ కార్డ్‌ల రూల్స్‌ను మార్చింది.


ఇదిలా ఉండగా.. ఎస్‌బ్యాంకులో వాటాను పెంచుకునేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. దాంతో బ్యాంకు షేర్లు 13శాతం పెరిగాయి. ఎస్‌బ్యాంకు షేర్‌ విలువ రూ.25.70కి చేరింది. మరోవైపు ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌కు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్ కూడా కీలక మార్పులు చేయబోతున్నది. ఈ మార్పులు కూడా ఏప్రిల్ 2024 నుంచి అమలులోకి తేబోతున్నది. కార్డ్ హోల్డర్లు చివరి త్రైమాసికంలో కనీసం రూ.35వేలు ఖర్చు చేయాలి. వచ్చే త్రైమాసికంలో లాంచ్‌ కోసం చివరి త్రైమాసికంలో రూ.35వేల వరకు ట్రాన్సాక్షన్స్‌ చేయాల్సి ఉంటుంది.