ట్రాన్స్‌జెండ‌ర్‌ను ప్రేమించి, పెళ్లాడిన యువ‌కుడు.. వీడియో

Transgender Marriage | ప్రేమించుకోవ‌డానికి జెండర్‌ కూడా అడ్డుకాదని నిరూపించాడు ఓ యువకుడు. ట్రాన్స్‌ జెండర్‌ను వివాహం చేసుకుని, ఆమెకు కొత్త జీవితాన్నిచ్చి.. బాసటగా నిలిచాడు. మ‌రి ఈ వివాహం గురించి తెలుసుకోవాలంటే క‌రీంన‌గ‌ర్ జిల్లా వెళ్లాల్సిందే. వివ‌రాల్లోకి వెళ్తే.. వీణ‌వంక మండ‌ల కేంద్రానికి చెందిన క‌డూంచి మంగ‌మ్మ, గోపాల్ దంప‌తుల‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో రెండో కుమారుడు సంప‌త్ ఏడో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకున్నాడు. ఆ త‌ర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయి ట్రాన్స్‌జెండ‌ర్‌గా మారాడు. […]

ట్రాన్స్‌జెండ‌ర్‌ను ప్రేమించి, పెళ్లాడిన యువ‌కుడు.. వీడియో

Transgender Marriage | ప్రేమించుకోవ‌డానికి జెండర్‌ కూడా అడ్డుకాదని నిరూపించాడు ఓ యువకుడు. ట్రాన్స్‌ జెండర్‌ను వివాహం చేసుకుని, ఆమెకు కొత్త జీవితాన్నిచ్చి.. బాసటగా నిలిచాడు. మ‌రి ఈ వివాహం గురించి తెలుసుకోవాలంటే క‌రీంన‌గ‌ర్ జిల్లా వెళ్లాల్సిందే.

వివ‌రాల్లోకి వెళ్తే.. వీణ‌వంక మండ‌ల కేంద్రానికి చెందిన క‌డూంచి మంగ‌మ్మ, గోపాల్ దంప‌తుల‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో రెండో కుమారుడు సంప‌త్ ఏడో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకున్నాడు. ఆ త‌ర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయి ట్రాన్స్‌జెండ‌ర్‌గా మారాడు. త‌న పేరును దివ్య‌గా మార్చుకున్నాడు. జ‌గిత్యాల‌లో ఉంటున్న దివ్య‌కు కారు డ్రైవ‌ర్ అర్ష‌ద్ ప‌రిచ‌యం అయ్యాడు. వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం.. అర్ష‌ద్‌లో ప్రేమ‌ను చిగురించింది. త‌న ప్రేమ విష‌యాన్ని దివ్య‌కు చెప్పాడు. పెళ్లి చేసుకుంటాన‌ని ప‌లుసార్లు ప్ర‌స్తావ‌న‌కు తీసుకొచ్చాడు.

అయితే అత‌ని ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రిస్తూ వ‌చ్చింది దివ్య‌. ట్రాన్స్‌జెండ‌ర్ జ‌మ్మికుంట మున్సిప‌ల్ ప‌రిధిలోని హౌజింగ్ బోర్డు కాల‌నీకి మ‌కాం మార్చింది. అర్ష‌ద్ దివ్య జ‌మ్మికుంట‌లో ఉన్న‌ట్టు తెలుసుకున్నాడు. గురువారం జ‌మ్మికుంట‌కు వ‌చ్చిన అర్ష‌ద్.. పెళ్లికి దివ్య‌ను ఒప్పించాడు. ఆమె అంగీక‌రించ‌డంతో.. కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో, పంచ‌భూతాల సాక్షిగా దివ్య మూడు ముళ్లు వేశాడు. ఆమెతో ఏడు అడుగులు వేసి ఒక్క‌ట‌య్యారు. ఇక త‌న పేరును హర్షిత్‌గా మార్చుకున్నాడు అర్ష‌ద్.
వివాహ తంతు ముగిసిన అనంత‌రం నూత‌న వ‌ధూవ‌రులు ఇల్లంద‌కుంట మండ‌ల కేంద్రంలోని శ్రీ సీతారామ‌చంద్ర స్వామి ఆల‌యాన్ని శుక్ర‌వారం సంద‌ర్శించారు. అర్చ‌కుల ఆశీర్వాదం తీసుకున్నారు.