Sleep Deprivation : సరిగ్గా నిద్రపోవట్లేదా?.. మీ బ్రెయిన్‌కు భారీ నష్టం తప్పదు
సరిగ్గా నిద్రలేకపోవడం మెదడు కణాలను దెబ్బతీసే ప్రమాదముందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ 6-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి అత్యంత అవసరం.
నిద్ర.. ప్రతి జీవికి అత్యంత ముఖ్యమైనది. ఒక్కరోజు భోజనం చేయకున్నా మనిషిపై పెద్దగా ప్రభావం పడదు. కానీ, అదే నిద్ర లేకపోతే మాత్రం తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఒక రోజు నిద్ర సమయంకంటే ఆలస్యంగా పడుకున్నా దాని తీవ్రత వ్యక్తిపై రెండు నుంచి మూడు రోజుల వరకు ఉంటుంది. ఒక గంట ఆలస్యంగా పడుకుంటే ఆ గంటను భర్తీచేయడానికి మెదడుకు ఒకరోజు పడుతుందట. దీంతో పాటు సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల అనేక నష్టాలు కలుగుతాయని అధ్యయనాల్లో వెల్లడయింది.
నిద్ర లేకపోవడం.. అనేది మీరు ఊహించినదానికంటే చాలా ప్రమాదకరంగా ఉంటుందని తాజా పరిశోధనల్లో తేలిది. ఆ పరిశోధన ప్రకారం.. మనిషికి తగినంత నిద్ర లేకపోతే మెదడు దాని సొంత కణాలను తినడం ప్రారంభిస్తుంది. నిద్రలేమి వల్ల శరీరంలోని ఇతర అవయవాల కంటే మెదడును ఎక్కువగా ప్రేరేపించగలగడంతో పాటు మెదడు పనితీరుపై శాశ్వత ప్రభావం చూపించగలదు. దీనివల్ల మెదడు దెబ్బతినే అవకాశం లేకపోలేదు.
మెదడు దెబ్బతింటుంది అనడానికి లక్షణాలు..
తలనొప్పి..జ్వరం.. మెడగట్టి.. ఆకలి.. వాంతులు, మూర్ఛలు, కోమా కూడా మెదడు దెబ్బతింటుందనడానికి కారణాలుగా ఉన్నాయి. అలాగే, ఒత్తిడితో పాటు మెటబాలిజం దెబ్బతినడం కూడా మెదడు కణాలను చంపడానికి.. మెదడు పరిమాణాన్ని తగ్గించే ప్రమాదం ఉంది. అయితే, మెదడును రక్షించుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి… వయస్సు మీద పడిన వారు 7 నుంచి 9 గంటల వరకు నిద్రపోవడం మంచిది. పడుకునే ముందు కొన్ని ఆహారాలు, పానీయాలు తీసుకోవడం ద్వారా నిద్ర మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. బాదం, కివి, చెర్రీ, చేప, అక్రోట్లు, పాలు లాంటి వాటిని ఆహారంలో భాగంలో చేసుకోవాలి.
నిద్ర అనేది మంచి ఆరోగ్యానికి పునాది లాంటిది. దానిని నెగ్లెక్ట్ చేయకుండా సరైన సమయంలో పడుకోవాలి. ముఖ్యంగా యువత రాత్రి 12 లేదా 1 అయినా ఫోన్ పట్టుకుని చూస్తుంటారు. దీని వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. దీని ప్రభావం తరువాతి రోజు పడుతుంది. ఇది దీర్ఘకాలంలో మనిషికి తీవ్ర అనారోగ్య కారణాలను తెచ్చిపెడుతుంది. అందుకే, ప్రతిరోజు ప్రశాంతంగా నిద్రపోండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram