Radish | ఫ్యాటీ లివర్‌ సమస్యకు చక్కటి పరిష్కారం ముల్లంగి.. దీని ప్రయోజనాలు తెలిస్తే తినక మానరు..!

Radish | కాలేయ కొవ్వు (Fatty liver ‌).. జీవనశైలి మార్పుల కారణంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఫ్యాటీ లివర్ వ్యాధిని మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా మారింది.

  • By: raj |    food-news |    Published on : Jan 16, 2026 10:00 PM IST
Radish | ఫ్యాటీ లివర్‌ సమస్యకు చక్కటి పరిష్కారం ముల్లంగి.. దీని ప్రయోజనాలు తెలిస్తే తినక మానరు..!

Radish | కాలేయ కొవ్వు (Fatty liver ‌).. జీవనశైలి మార్పుల కారణంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఫ్యాటీ లివర్ వ్యాధిని మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా మారింది. ఒకప్పుడు తేలికపాటి సమస్యగా భావించినప్పటికీ.. ఇప్పుడు తీవ్రమైన ముప్పుగా మారుతోంది. కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.

సాధారణంగా శరీరంలో కొవ్వు తగ్గినప్పుడు కాలేయంలో ఉన్నదాన్ని వినియోగించుకుంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జంక్‌ఫుడ్స్, ఆల్కహాల్‌ వినియోగంతో శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కొవ్వు అందడం.. అదంతా కాలేయంలో జమవుతోంది. 5 శాతం కంటే దాటితే అది ఫ్యాటీలివర్‌కు దారితీస్తుంది. ఫ్యాటీ లివర్‌ను ‘సైలెంట్ డిసీజ్’ అని కూడా అంటారు. ఎందుకంటే దీని లక్షణాలు స్పష్టంగా కనిపించవు. ప్రారంభ దశలో దీనిని గుర్తించి చికిత్స తీసుకోకపోతే.. ఇది కాలేయంలో వాపు, క్యాన్సర్‌కు కూడా దారితీయొచ్చు.

ప్రమాదం నుంచి ఇలా బయటపడొచ్చు..

అయితే, మనం రోజూ తీసుకునే ఆహార ఎంపికల వల్ల ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చు. అందులో ముల్లంగి (Radish) ఒకటి. ఇది కాలేయ కొవ్వు సమస్యకు చక్కటి పరిష్కారం అని నిపుణులు చెబుతున్నారు. దీన్ని కాలేయ సమస్యలకు సూపర్‌ హీరోగా పేర్కొంటున్నారు. కాలేయం నుంచి విషతుల్యాలను బయటకు పంపడంలో ఇది సహాయపడుతుంది. ముల్లంగి ఒక సహజమైన డిటాక్స్ హెల్పర్‌గా పనిచేస్తుందట. ‘ముల్లంగి.. కాలేయం నుంచి విషతుల్యాలను బయటకు పంపి.. కాలేయాన్ని ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది’ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాలేయ సమస్యలు ఉన్నవారికి ముల్లంగి ఎంతో మేలు చేస్తుందట.

సాధారణంగా ముల్లంగిని ఎవరూ పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే ముల్లంగి రుచికి చాలా ఘాటుగా ఉంటుంది. వాస‌న‌గా కూడా బాగోదు. అందువల్లే ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్ట ప‌డ‌రు. అయితే ముల్లంగిని తిన‌డం వల్ల ఎన్నో అద్భుత‌మైన ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ముల్లంగిలోని పోషకాలు.. కాలేయం, జీర్ణ వ్యవస్థకు మంచి చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి పైల్స్‌ నివారణకు సాయపడుతుంది.
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టంతో పోరాడతాయి. లేదంటే ఈ నష్టం కాలక్రమేణా కాలేయ వాపుకు దారి తీస్తుంది. అందుకే ముల్లంగిని కాలేయానికి ఒక ‘క్వైట్‌ బాడీగార్డ్‌’గా అభివర్ణిస్తారు. బైల్ (Bile) ప్రవాహాన్ని, కొవ్వు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముల్లంగి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది బైల్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. మెరుగైన బైల్ ప్రవాహం శరీరంలోని కొవ్వులను సమర్థవంతంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. కొవ్వులు సరిగ్గా విచ్ఛిన్నమైనప్పుడు, అది ఫ్యాటీ లివర్ (Fatty Liver) సమస్య తగ్గడానికి తోడ్పడుతుంది. ఎర్ర రక్తకణాలకు ఆక్సిజన్‌ సరఫరా చేసి.. రక్తాన్ని శుభ్రపరచడంలోనూ సాయపడుతుంది. ఇందులో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సాయపడుతుంది. జలుబు, ఫ్లూ వంటి సాధారణ శీతాకాలపు అనారోగ్యాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అధిక ఫైబర్‌ కంటెంట్‌ మంచి జీర్ణశక్తిని ఇస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.