Diabetic Patients | డయాబెటిస్‌తో బాధపడుతున్నారా..? వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
Diabetic Patients | ఎండలు మండిపోతున్నాయి. సాధారణ స్థాయికి మించి భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 44 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారు మరి ముఖ్యంగా షుగర్(డయాబెటిక్) వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Diabetic Patients | ఎండలు మండిపోతున్నాయి. సాధారణ స్థాయికి మించి భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 44 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారు మరి ముఖ్యంగా షుగర్(డయాబెటిక్) వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. షుగర్ ఉన్న వారు డీహైడ్రేషన్‌కు గురైతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. షుగర్ లెవల్స్‌లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
సమస్యలు ఇవే..
సాధారణంగా ఎండాకాలంలో శరీరం త్వరగా డీహైడ్రేట్ అయిపోతుంది. షుగర్ పేషెంట్స్‌లో షుగర్ లెవల్స్ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. అలసట వస్తుంది. తలనొప్పి వస్తుంది. వడదెబ్బకు కూడా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
ఎండలు ముదురుతున్న నేపథ్యంలో షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా తగినంత నీరు తీసుకోవాలి. రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తీసుకోవాలి. ఇంటి ఫుడ్‌కే పరిమితం కావాలి. మధ్యాహ్నం సమయంలో బయట తిరగడం మానుకోవాలి. శరీరం చల్లగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇక వీలైతే రెగ్యులర్‌గా షుగర్ లెవల్స్ పరీక్షించుకుంటే బెటర్.
ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది..?
ఉదయం నుంచి రాత్రి వరకు తీసుకునే ఆహారం విషయంలోనూ డయాబెటిక్ రోగులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఒకేసారి అధిక మోతాదులో తీసుకోకుండా.. మితంగా తీసుకుంటే మంచిది. గ్లెసెమిక్ ఇండెక్స్ ఇబ్బంది లేకుండా ఉండేందుకు బ్రౌన్ రైస్, ఓట్స్, మిల్లెట్స్ వంటి ఫుడ్స్ తీసుకోవాలి. పాలకూర, బీరకాయ, దోసకాయ వంటి కూరగాయలు మెనూ చేర్చుకోవాలి. జామకాయ, ఆపిల్, బెర్రీస్ వంటి ఫ్రూట్స్ పరిమిత మోతాదులో తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగవు. మజ్జిగ శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు జీర్ణక్రియకు కూడా మద్ధతు ఇస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే పప్పులు, గుడ్లు, టోఫు వంటివి తీసుకోవచ్చు.
వీటికి దూరంగా ఉండాల్సిందే..
డయాబెటిస్ ఉన్నవారు.. డీహైడ్రేషన్ దూరం చేసుకోవాలనే నెపంతో చల్లని సోడాలు, సాఫ్ట్ డ్రింక్స్ తాగకూడదు. దాహం వేస్తే నీళ్లు లేదా సహజమైన నీరు తీసుకోవాలి. అలాగే చక్కెర అధికంగా ఉన్న జ్యూస్‌లు తీసుకోకూడదు. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తీసుకుంటే షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram