Sticker on Fruit | పండ్లు, కూరగాయలపై స్టిక్కర్ల నెంబర్ల వెనుక హిస్టరీ తెలుసా?
పండ్లు, కూరగాయలపై స్టిక్కర్లను ఎప్పుడైనా చూశారా? ఈ స్టిక్కర్లపై ఉన్న నెంబర్లకు అర్ధం తెలుసా? ఈ నెంబర్లు ఆ పండ్లు లేదా కూరగాయలు హిస్టరీని చెబుతాయి? ఈ స్టిక్కర్లు తినకుండా పండ్లు తినవచ్చా? స్టిక్కర్లు లేకుండా తింటే ఏం జరుగుతుంది? ఈ విధానం ఎప్పటి నుంచి ప్రారంభించారో తెలుసుకుందాం.
                                    
            Sticker on Fruit | పండ్లు, కూరగాయలపై నెంబర్లతో కూడిన స్టిక్కర్ల విధానం 1990లో ప్రారంభమైంది. ఈ పండ్లు, కూరగాయలు ఎలా పండించారు, వీటి ధర ఎంత అనేవి తెలుసుకొనేందుకు వీలుగా ఈ స్టిక్కర్ విధానం అమల్లోకి తెచ్చారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ ప్రొడ్యూస్ స్టాండర్డ్స్ ఐఎఫ్‌పీఎస్ దీన్ని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా పీఎల్ యూ స్టిక్కర్లు అంటే ప్రైస్ లుక్ అప్ స్టిక్కర్లు ప్లాస్టిక్, కాగితం లేదా వినైల్ తో తయారు చేస్తారు. ఈ స్టిక్కర్లను అతికించేందుకు ఉపయోగించే జిగురు తినవచ్చు. జీర్ణం కూడా అవుతుంది. ఈ జిగురును ఫుడ్ అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. కానీ, ఇందులో ఉండే రబ్బర్ క్లోరైడ్, వివిధ రకాల పాలిమర్ వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి మానవ శరీరానికి ఏ మాత్రం మంచిది కాదు. అంటే పండ్లు, కూరగాయలపై ఉన్న స్టిక్కర్లను తొలగించి శుభ్రంగా కడిగి తినాలి.
పండ్లు, కూరగాయలపై ఉండే నెంబర్లు ఏం చెబుతాయి?
నాలుగు నెంబర్ తో ప్రారంభమయ్యే నెంబర్ సహజసిద్దంగా పండిన పంటగా సూచిస్తుంది. అంటే ఏదైనా పండు లేదా కూరగాయలపై 4080 లేదా 4011 వంటి నెంబర్లు ఉంటే ఇవి సహజసిద్దంగా పండినవి అని అర్ధం. ఇలా స్టిక్కర్లు వేసిన పండ్లు, కూరగాయలు ఎక్కువగా సూపర్ మార్కెట్లు, మాల్స్ లో కనిపిస్తాయి. ఇక 8 అంకెతో ఉన్న పండ్లు లేదా కూరగాయలు జన్యుమార్పిడిని సూచిస్తాయి. అంటే 84011 అనే నెంబర్ ఉంటే ఈ పండు జన్యు మార్పిడికి చెందిందిగా గుర్తించవచ్చు. జన్యు మార్పిడి పండ్లు ఆరోగ్యానికి మంచివి కావని నిపుణులు చెబుతున్నారు. ఒక 9 అంకెతో ఉండే కోడ్ సేంద్రీయ ఎరువులతో పండించినదిగా తెలుపుతుంది.94001 అని ఉంటే ఇది సేంద్రీయ ఎరువులతో పండించిందని సూచిస్తుంది.
ట్రాక్ చేయడం సులభం
పండ్లపై స్టిక్కర్లను అతికించడానికి ఒక పెద్ద కారణం ఏమిటంటే వాటిని సులభంగా ట్రాక్ చేయవచ్చు. మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ తాజా పండ్లు, కూరగాయలను ప్రపంచ వ్యాప్తంగా రవాణ అవుతాయి. స్టిక్కర్లపై ఉన్న అంకెలు ఇవి ఎక్కడ పండించారో కూడా తెలుసుకోవచ్చు. ఇవి తిన్న తర్వాత ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఈ వివరాలు తెలుసుకోవడానికి ఈ నెంబర్లు ఉపయోగపడతాయి. పండ్లపై స్టిక్కర్లు వేయడానికి మరొక కారణం ఏమిటంటే వాటి బ్రాండ్‌లను గుర్తించడానికి సహాయపడుతుంది. స్టిక్కర్లపై రైతు లేదా విక్రేత పేరు లేదా చిహ్నం ఉండవచ్చు. ఇది బ్రాండ్ గురించి ప్రజలకు మరింత తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఈ డేటా కస్టమర్లకు ఉపయోగపడుతుంది.
స్టిక్కర్ ఎలా తొలగించాలి?
పండ్లు, కూరగాయలను తొలగించడానికి సులభమైన మార్గం స్కాచ్ టేప్ ట్రిక్. ఇది చాలా సులభం. . మీరు స్టిక్కర్‌ను స్కాచ్ టేప్‌తో కప్పి ఒకేసారి అన్నింటినీ తీసివేయాలి. అమెరికాలో 2009లో ఆమోదించిన చట్టం ప్రకారం పండ్లు, కూరగాయల గురించి పూర్తి సమాచారం వినియోగదారులకు తెలియాలి. దీనిని కంట్రీ ఆఫ్ ఆరిజన్ లేబులింగ్ అంటారు. అంటే ఈ స్టిక్కర్ పై దేశం పేరును కూడా లేబుల్ పై లేదా దాని పక్కన ఉన్న గుర్తుపై ప్రదర్శించవచ్చు.
                    
                                    X
                                
                        Google News
                    
                        Facebook
                    
                        Instagram
                    
                        Youtube
                    
                        Telegram