Fruits for Skin Health | చర్మం మిలమిల మెరిసిపోవాలా?.. ఈ పండ్లు తినాల్సిందే!

మనిషి నిత్యజీవనంలో పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిని ఆహరంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని అందరికి తెలిసిన విషయమే. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యంతో పాటు అందం కూడా మెరుగుపడుతుంది.

Fruits for Skin Health | చర్మం మిలమిల మెరిసిపోవాలా?.. ఈ పండ్లు తినాల్సిందే!

విధాత, హైదరాబాద్ :

మనిషి నిత్యజీవనంలో పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిని ఆహరంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని అందరికి తెలిసిన విషయమే. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యంతో పాటు అందం కూడా మెరుగుపడుతుంది. మరీ ముఖ్యంగా మన శరీరంలో అనేక మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. పండ్లు, కూరగాయలు, నట్స్, మొక్కల్లో మనకు తెలియని అద్బుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ప్రముఖ వైద్యనిపుణులు చెబుతున్నారు.

గుండెకు దానిమ్మ రక్ష..

దానిమ్మ తినడం ద్వారా హృదయ ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఫ్రూట్ ను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గుతుంది. రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుంది. రక్తనాళాల్లో ప్లాక్ ఏర్పడే వేగం తగ్గిపోతుంది. రక్తప్రసరణలో మెరుగుదల ఏర్పాడుతుంది. ఒక సంవత్సరం పాటు దానిమ్మ జ్యూస్ తాగినవారిలో ఆర్టరీల మందం తగ్గడం కూడా గమనించారట.

చర్మం కోసం ఉసిరి..

విటమిన్ సీ అత్యధికంగా ఉండే పండులో ఉసిరి టాప్ ప్లేస్ ఉంటుంది. విటమిన్ సీ తో పాటు యాంటి యాక్సిడెంట్లు ఈ సిట్రస్ పండులో అధికంగా ఉంటాయి. ఆమ్లాను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పర్యావరణ కాలుష్యం నుంచి చర్మానికి రక్షణ కలుగుతుంది. సూర్యరశ్మి కారణంగా వచ్చే డ్యామేజ్‌ను తగ్గిస్తుంది. చర్మంలో కోలాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. చర్మ(ఎలాస్టిసిటీ), గట్టిదనం మెరుగుపడుతుంది. చర్మంపై ముడతలు తక్కువగా ఏర్పడడంతో పాటు డిహైడ్రేషన్ గా ఉంచుంది. నిరంతరం ఆమ్లా తీసుకుంటే చర్మం మరింత కాంతివంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణక్రియకు పపాయ సాయం..

పపాయాలో ఉన్న పపైన్ (Papain) అనే జీర్ణ ఎంజైమ్, ఫైబర్ జీర్ణక్రియను చాలా సులభం చేస్తాయి. ఆహారంలోని ప్రోటీన్లను సులభంగా అరిగించడంతో పాటు బ్లోటింగ్, అసిడిటిని తగ్గిస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రైప్ పపాయాలో తయారయ్యే షార్ట్ చైన్ ఫ్యాటీ ఆసిడ్స్ గట్ హెల్త్‌కు మేలు చేస్తుంది. రోజూ పపాయా తీసుకుంటే జీర్ణక్రియ గణనీయంగా మెరుగవుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

తక్షణ శక్తికి అరటి..

అథ్లెట్లు ఎక్కువగా ఎంచుకొను ఎనర్జీ ఫుడ్ లో అరటి ఒకటిగా ఉంటుంది. మనం క్రికెట్ మ్యాచులు లేదా ఫుట్ బాల్ గేమ్ లు చూస్తున్నప్పుడు మధ్యలో ఆటగాళ్లు అరటి పండ్లు తింటుంటారు. ఈ అరటి తినడం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీ రావడంతో పాటు త్వరగా జీర్ణం అవుతుంది. అందుకనే అథ్లెట్స్ గేమ్స్ ఆడే సమయంలో అరటి పండును ఆరగిస్తారు. ఒక సాధారణ సైజ్ అరటి పండులో 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, విటమిన్ B6 & C, అధిక పొటాషియం ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని పెంచకుండా శరీరానికి తక్షణ శక్తిని తఇస్తుంది. పొటాషియం కారణంగా మజిల్ క్రాంప్స్ తగ్గించడంలో** కూడా అరటి కీలక పాత్ర పోషిస్తుంది.

గువాతో ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు

గువ్వలోని ఫైబర్ + ప్లాంట్ పోలీఫీనాల్స్ కలిసి రక్తంలో చక్కెర శోషణ వేగాన్ని తగ్గిస్తాయి. రోజుకో గువా తినడం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి..రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పెరుగుతుంది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గింపులో ఉపయోగపడుతుంది. చలికాలంలో జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి రక్షణ కోసం గువ్వ అద్భుతంగా ఉపయోగపడుతుందని పరిశోధనల్లో తేలింది.

ఎముకల బలానికి మునగ..

మునగ ఆకు పొడిలో ఉన్న కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇవి ఎముకలను బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మునగను తీసుకోవడం ద్వారా ఎముకలు గట్టిపడటం, ఆస్టియోపోరోసిస్ వల్ల జరిగే ఎముక నష్టాన్ని తగ్గించడం, ఎముక గాయాలు త్వరగా మానుతాయి. మన దైనందిన ఆహారంలో ఈ పండ్లు, మొక్కలను చేర్చుకోవడం వల్ల హృదయం నుంచి చర్మం వరకూ, ఎముకల నుంచి జీర్ణక్రియ వరకు.. శరీరంలోని అనేక వ్యవస్థలు బలపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, సహజ పదార్థాలు కలిసి జీవనశైలి మెరుగయ్యేలా చేస్తాయి.