Okra Water | బ్లడ్ షుగర్‌తో బాధపడుతున్నారా..? బెండకాయ ఉండగ బెంగెందుకు..?
Okra Water | ఇటీవలి కాలంలో చాలా మంది బ్లడ్ షుగర్( Blood Sugar ) వ్యాధితో బాధపడుతున్నారు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురికావడం, కార్పొహైడ్రేట్స్( Carbo Hydrates ) తీసుకోవడం మూలంగా షుగర్ వ్యాధిని కొని తెచ్చుకుంటున్నారు. ఇలా డయాబెటిస్(Diabetes)తో బాధపడే వారు.. ప్రతి రోజు బెండకాయ నీటి( Okra Water )ని తాగితే బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేయొచ్చు.
Okra Water | బెండకాయ( Ladies Finger ) అంటే అందరికీ ఇష్టమే. వంటకాల్లో దీనికి ప్రాధాన్యత ఉంటుంది. బెండకాయ ఫ్రై చేస్తే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే ఈ బెండకాయ బ్లడ్ షుగర్( Blood Sugar ) వ్యాధిగ్రస్తులకు ఓ వరం లాంటింది. రాత్రంతా బెండకాయ ముక్కలను నీళ్లల్లో( Okra Water ) నానబెట్టి.. పొద్దున్నే ఆ నీటిని సేవిస్తే డయాబెటిక్(Diabetes) నుంచి ఉపశమనం పొందొచ్చు. అయితే ఈ నీటిని పరగడుపున తాగితేనే లాభం.
బెండకాయలో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కలిసి శరీరానికి అనేక లాభాలు ఇస్తాయి. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో తాగితే పోషకాలను శరీరం బాగా అబ్జార్వ్ చేస్తుంది. అయితే దీనిని రెగ్యులర్‌గా నెలరోజులు తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్‌లోకి వస్తుంది.
బ్లడ్ షుగర్ కంట్రోల్
డయాబెటిస్‌తో బాధపడేవారు.. బెండకాయను తమ మెనూలో భాగం చేసుకోవాలి. అలా అని కూరగా చేసుకోని తినడం కాదు. ఒకట్రెండు బెండకాయలను ప్రతి రోజు రాత్రి ముక్కలు ముక్కలుగా కోసి.. ఓ గ్లాసు నీళ్లల్లో నానబెట్టాలి. పొద్దున్నే పరగడుపున ఆ బెండకాయ ద్రావణాన్ని తీసుకోవాలి. దాంతో కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా జీర్ణమవుతాయి. రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగదు. అంతేకాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం బెండకాయలో ఉండే ఫ్లావనాయిడ్స్, పాలీఫినాల్స్ షుగర్ లెవల్స్ తగ్గించడంలో సహాయపడతాయని తేలింది.
మెరుగైన జీర్ణక్రియ
బెండకాయలో ఉండే సాల్యూబుల్ ఫైబర్, మ్యూసిలేజ్ అనే జెల్‌లాంటి పదార్థం జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. దీనివల్ల ఆహారం సాఫీగా జీర్ణమవుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. ఎసిడిటీ, గ్యాస్, బ్లోటింగ్ సమస్యలు దూరమవుతాయి. అలాగే గట్‌లో ఉన్న మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తుంది. దీంతో గట్ హెల్త్ మెరుగుపడుతుంది.
ఇమ్యూనిటీ బూస్టర్
బెండకాయలో విటమిన్ C, క్వెర్సెటిన్ వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ బలపడుతుంది. జలుబు, జ్వరం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బెండకాయ నీటితో ప్రయోజనాలు ఉన్నాయని రోజంతా తాగకూడదు. రోజుకు 1 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. షుగర్ పేషెంట్స్ మందులు వాడుతున్నట్లయితే వైద్యుల సూచనల ప్రకారం తీసుకుంటే మంచిది. అలర్జీలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. నిపుణుల సలహాలు తీసుకోవాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram