IRCTC Ladakh Tour | లడఖ్ – లేహ్ అందాలను చూడాలా.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ రెడీ!

IRCTC Ladakh Tour | లడఖ్-లేహ్ ప్రాంతాలను చూడాలని అనుకునే వారికోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా ఒక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. మే 10వ తేదీన హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటన మొత్తం ఆరు రాత్రులు, ఏడు రోజుల పాటు కొనసాగనుంది.

IRCTC Ladakh Tour | లడఖ్ – లేహ్ అందాలను చూడాలా.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ రెడీ!

IRCTC Ladakh Tour | లడఖ్-లేహ్ ప్రాంతాలను చూడాలని అనుకునే వారికోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా ఒక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది మంచుతో కప్పబడిన పర్వతాలు, గడ్డకట్టిన సరస్సులు, వ్యాలీలు ఇలా అన్నింటినీ చూసే ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ఈ టూర్‌‌ను ప్లాన్ చేసింది. మే 10వ తేదీన హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటన మొత్తం ఆరు రాత్రులు, ఏడు రోజుల పాటు కొనసాగనుంది.

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా లడఖ్‌లోని షామ్ వ్యాలీ, లేహ్ మార్కెట్, శాంతి స్తూపం, ఇండస్-జంస్కార్ సంగమం, మ్యాగ్నెటిక్ హిల్ అనుభవం, నుబ్రా వ్యాలీ, టుర్టుక్(ఇండియా – పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం), పాంగాంగ్ సరస్సు(3ఇడియట్స్ మూవీ షూటింగ్ స్పాట్)ను వీక్షించవచ్చు. దీన్ని ఇండియాలోనే బెస్ట్ అడ్వెంచర్ ట్రిప్‌గా ట్రావెలర్స్ చెబుతుంటారు.

ప్యాకేజీ ధరలు

ఈ టూర్ కోసం ఐఆర్‌సీటీసీ పెద్దల నుంచి ఒక్కొక్కరికీ రూ.67,950(సింగిల్ ఆక్యుపెన్సీ) వసూలు చేస్తోంది. అదే డబుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికీ రూ.62,360; ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.61,880 చార్జి చేస్తుంది. ఇక పిల్లలకు అయితే బెడ్‌తో కలిపి రూ.54,500; బెడ్ లేకుండా అయితే రూ.40,900 వసూలు చేస్తున్నారు.

రోజువారీ టూర్ ప్లాన్!

మొదటి రోజు: హైదరాబాద్ నుంచి విమానంలో లేహ్ చేరుకుంటారు. విమానశ్రయం నుంచి హోటల్‌కు వెళ్తారు. అక్కడి వాతావరణం అలవాటుకావడం కోసం ఆ రోజంతా పూర్తి విశ్రాంతి ఉంటుంది. మధ్యాహ్నం లంచ్, డిన్నర్ హోటల్‌లోనే ఉంటాయి.

రెండో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం సైట్ సీయింగ్‌కు బయల్దేరతారు. శాంతి స్తూప, లేహ్ ప్యాలెస్, హాల్ ఆఫ్ ఫేమ్ సందర్శిస్తారు. అలాగే మ్యాగ్నెటిక్ హిల్, ఇండస్ – జంస్కార్ సంగమం కూడా వీక్షిస్తారు. రాత్రికి లేహ్‌లోని హోటల్‌లో బస ఉంటుంది.

మూడో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం ఖర్దుంగా పాస్ ద్వారా నుబ్రా వ్యాలీకి బయల్దేరతారు. క్యాంప్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత లంచ్ చేస్తారు. అనంతరం దీక్షిత్, హుందర్ గ్రామాలను సందర్శిస్తారు. కావాలనుకుంటే ఒంటెలపై సఫారీ చేయవచ్చు. రాత్రికి నుబ్రా వ్యాలీలోనే బస ఉంటుంది.

నాలుగో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం భారత్, పాక్ సరిహద్దు గ్రామమైన టుర్టుక్‌ సందర్శనకు వెళ్తారు. అక్కడ సియాచిన్ వార్ మెమోరియల్‌ను సందర్శిస్తారు. సిల్క్ రూట్ హిస్టరీ అనుభవం కూడా పొందవచ్చు. అనంతరం నుబ్రా వ్యాలీకి తిరిగివస్తారు. రాత్రికి అక్కడే బస ఉంటుంది.

ఐదో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం పాంగాంగ్ సరస్సు సందర్శనకు వెళ్తారు. 3ఇడియట్స్ మూవీ షూటింగ్ స్పాట్‌లను కూడా సందర్శిస్తారు. రాత్రికి పాంగాంగ్‌లోనే బస ఉంటుంది.

ఆరో రోజు: ఉదయం పాంగాంగ్ సరస్సు ఒడ్డున అందమైన సూర్యోదయాన్ని ఆస్వాదిస్తారు. అనంతరం బ్రేక్‌ఫాస్ట్ చేసుకుని లేహ్‌కు తిరిగి బయల్దేరతారు. మార్గమధ్యలో థిక్సే మఠం, షే ప్యాలెస్‌ను సందర్శిస్తారు. షే విలేజ్‌లో 3ఇడియట్స్‌ సినిమాలో కనిపించే స్కూల్‌ను కూడా సందర్శిస్తారు.

ఏడో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం లేహ్ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.

ప్యాకేజీలో ఉండే సదుపాయాలు

* విమాన టికెట్లు
*3 స్టార్ హోటల్+ క్యాంప్ స్టే
* ఆరు బ్రేక్‌ఫాస్ట్, 6 లంచ్, 6 డిన్నర్
* లోకల్ ట్రాన్స్‌పోర్టు
* టూర్ గైడ్+ టూర్ మేనేజర్
* ట్రావెల్ ఇన్సూరెన్స్
* ఎంట్రీ టికెట్లు

ప్యాకేజీలో లేని సదుపాయాలు

* ఒంటెల సఫారీ
* వ్యక్తిగత ఖర్చులు

ముఖ్య నిబంధనలు

* హై ఆల్టిట్యూడ్ ప్రాంతం కాబట్టి మొదటి రోజు విశ్రాంతి అవసరం
* బీపీ, అనారోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.
* నెట్‌వర్క్ తక్కువగా ఉంటుంది, పాంగాంగ్‌లో ఎలక్ట్రిసిటీ పరిమితంగా ఉంటుంది కాబట్టి వాటన్నింటికీ సిద్ధపడి ఉండాలి.

Read More:

Sri Lanka Ramayana Yatra | హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ పూర్తి వివరాలివే!

IRCTC Thailand Tour | హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ టూర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ.. రూ.53,900 నుంచే!