Sri Lanka Ramayana Yatra | హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ పూర్తి వివరాలివే!

Sri Lanka Ramayana Yatra | రామాయణానికి సంబంధించి ముఖ్య ఘట్టాలు జరిగిన శ్రీలంకలోని పవిత్ర ప్రదేశాలను చూసేందుకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. శ్రీలంక రామాయణ యాత్ర పేరుతో తెచ్చిన యాత్రలో భాగంగా హైదరాబాద్ నుంచి బయల్దేరి కొలంబో, డంబుల్లా, కాండీ, నువర ఎలియా వంటి ప్రాంతాలను చుట్టివచ్చేలా ఐఆర్‌సీటీసీ ఈ ట్రిప్‌ను షెడ్యూల్ చేసింది.

Reported by: Chandram | ట్రెండింగ్ | Mar 25, 2026, 12:49 am IST
Read Time: 7 mins
Sri Lanka Ramayana Yatra | హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ పూర్తి వివరాలివే!

Sri Lanka Ramayana Yatra | రామాయణానికి సంబంధించి ముఖ్య ఘట్టాలు జరిగిన శ్రీలంకలోని పవిత్ర ప్రదేశాలను చూసేందుకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ(IRCTC Special Tour Package)ని తీసుకొచ్చింది. శ్రీలంక రామాయణ యాత్ర పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా సీతమ్మ ఆలయం, హనుమాన్ దేవాలయం, అశోక వాటిక వంటి ప్రదేశాలు ఈ ట్రిప్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ రామాయణ ఘట్టాలతో పాటు అందమైన హిల్ స్టేషన్స్, బీచ్‌లను ఒకే ట్రిప్‌లో చూసేలా ఈ పర్యటనను రూపొందించింది.

హైదరాబాద్ నుంచి మే 14వ తేదీన ఈ రామాయణ యాత్ర ప్రారంభం కానుంది. మొత్తం ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి బయల్దేరి కొలంబో, డంబుల్లా, కాండీ, నువర ఎలియా వంటి ప్రాంతాలను చుట్టివచ్చేలా ఐఆర్‌సీటీసీ ఈ ట్రిప్‌ను షెడ్యూల్ చేసింది.

ప్యాకేజీ ధరలు

శ్రీలంక రామాయణ యాత్రలో భాగంగా సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.85,700 ధరను ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. అదే డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.63,500; ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.62,750 చార్జ్ చేయనుంది. ఇక పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.47,400; బెడ్ లేకుండా అయితే రూ.42,650 వసూలు చేయనుంది.

రోజు వారీ టూర్ ప్లాన్

మొదటి రోజు: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరతారు. మధ్యాహ్నం 3.25 గంటలకు వరకు శ్రీలంకలోని కొలంబో ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో డంబుల్లాకు బయల్దేరతారు. మార్గమధ్యలో మునీశ్వరం ఆలయం, మానవేరి ఆలయం దర్శించుకుంటారు. రాత్రికి డంబుల్లాలోనే డిన్నర్, బస ఉంటుంది.

రెండో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం డంబుల్లాలోని కేవ్ టెంపుల్‌కు వెళ్తారు మధ్యాహ్నం రెస్టారెంట్‌లో భోజనం అంతనరం త్రింకోమలికి వెళ్లి కోనేశ్వర ఆలయం, శ్రీ లక్ష్మీనారాయణ పెరుమాల్ ఆలయం దర్శించుకుంటారు. తిరిగి డంబుల్లాకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే డిన్నర్, బస ఉంటుంది.

మూడో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోటల్ చెక్‌అవుట్ చేసి కాండీకి బయల్దేరి వెళ్తారు. సిటీలోని పలు ప్రాంతాలను వీక్షిస్తారు. అనంతరం బుద్ధుడి దేవాలయం (టూత్ టెంపుల్), జెమ్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. రాత్రికి కాండీలోనే డిన్నర్, బస ఉంటుంది.

నాలుగో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం నువర ఎలియాకు బయల్దేరి వెళ్తారు. మార్గమధ్యలో శ్రీ భక్త హనుమాన్ దేవాలయం, సీతమ్మ ఆలయం, అశోక వాటికను దర్శించుకుంటారు. రాత్రికి నువరాఎలియాలోనే బస ఉంటుంది.

ఐదో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోటల్ చెక్‌అవుట్ చేసి బయల్దేరతారు. పిన్నావాలా ఎలిఫెంట్ ఆర్పనేజ్‌ను దర్శిస్తారు. అనంతరం కొలంబో చేరుకుని పంచముఖ ఆంజనేయ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత షాపింగ్ చేస్తారు. రాత్రికి కొలంబోలోనే బస ఉంటుంది.

ఆరో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం కొలంబో ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీలో ఉండే సదుపాయాలు

* విమాన టికెట్లు ( హైదరాబాద్ నుంచి కొలంబో రౌండ్ ట్రిప్)
* 3 స్టార్ హోటల్‌లో వసతి
* 5 బ్రేక్‌ఫాస్ట్‌లు, 4 లంచ్‌లు, 5 డిన్నర్‌లు
* లోకల్ ట్రాన్స్‌పోర్టుకు ఏసీ వాహనం
* టూర్ గైడ్
* ట్రావెల్ ఇన్సూరెన్స్
* శ్రీలంక వీసా

ప్యాకేజీలో లేని సదుపాయాలు

* వ్యక్తిగత ఖర్చులు
* టిప్స్
* అదనపు సేవలు( సాధారణ మెనూలో లేని ఫుడ్, వైన్, డ్రింక్స్)

ముఖ్య నిబంధనలు

* కనీసం ఆరు నెలల వ్యాలిడిటీతో పాస్‌పోర్టు ఉండాలి
* పూర్తి పేమెంట్ ముందుగానే చేయాలి
* క్యాన్సిలేషన్ చార్జీలు 20 శాతం నుంచి 100 శాతం వరకు ఉంటాయి.
* హోటల్, ఫ్లైట్ల షెడ్యూల్ మారవచ్చు.

పరిమిత సీట్లు ఉండటంతో ఆసక్తి గల పర్యాటకులు ముందుగానే బుక్ చేసుకోవాలని ఐఆర్‌సీటీసీ సూచిస్తోంది.

Read More:

IRCTC Thailand Tour | హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ టూర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ.. రూ.53,900 నుంచే!

ఐఆర్‌సీటీసీ హిమాచల్ ట్రిప్.. ఈ సమ్మర్‌లో షిమ్లా, మనాలిలో ఫుల్ చిల్!