• Telugu News
  • /Lifestyle

మౌన నేస్తాలు!

చెట్లు మన జీవితానికి మౌన నేస్తాలు అని చెబుతూ, వాటి విలువను గుర్తించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చే హృదయాన్ని తాకే మంజుల పత్తిపాటి కవిత..

Reported by: Tejaswini Nanna | జీవనశైలి | Nov 21, 2025, 3:11 pm IST
Read Time: 3 mins
మౌన నేస్తాలు!

భగ భగ మండుటెండలో జడువక మనకు
చల్లని నీడతో స్వాగతమిచ్చె చెట్లు
మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు అని తెలుసుకోని
మొక్కలను నాటు నాటించు!

బడిపిల్లలకు బెంచిలై,బడిపంతులకు కుర్చీలై
ప్రేమతో వారిని బరువనక మోసే
చెట్లు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు అని
తెలుసుకోని, మొక్కలను నాటు, నాటించు!

వృద్ధాప్యములో పెద్దకొడుకువోలే చేతికర్రై
సేవలందించే చెట్లు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు అని
తెలుసుకోని, మొక్కలను నాటు నాటించు!

దివ్య ఔషధాలు అందించి మహమ్మారి జబ్బులను నయం చేసే
చెట్లు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు అని
తెలుసుకోని మొక్కలను నాటు నాటించు!

విందు వినోదాల్లో మధుర ఫలాలు అందించి
నీకు పేరు ప్రఖ్యాతులు తీసుకవచ్చే చెట్లు
మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు అని
తెలుసుకోని మొక్కలను నాటు నాటించు!

సకాలంలో వర్షాలు అందించి రైతన్నల పాలిట
కల్పవృక్షమైనిలిచే చెట్లు మన చుట్టూ ఉన్న
మౌన నేస్తాలు అని తెలుసుకోని
మొక్కలను నాటు నాటించు!

మన పుట్టుక నుండిగిట్టేవరకు
కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ మన మనుగడకు
జీవనాధారం నిలిచే చెట్లు
మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు అని తెలుసుకోని
మొక్కలను నాటు నాటించు!!

రచన :
మంజుల పత్తిపాటి,
మాజీ డైరెక్టర్, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ,
యాదాద్రి భువనగిరి జిల్లా,
తెలంగాణ రాష్ట్రం,
మొబైల్ నంబర్: 9347042218.