Deer Killed | జూపార్కులో వీధి కుక్కల స్వైర విహారం.. 10 జింకలు మృతి
కేరళ లోని త్రిస్సూర్‌లో కొత్తగా ప్రారంభించిన పుత్తూరు జూపార్కు )లోకి వీధి కుక్కలు ప్రవేశించాయి. జూలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ జింకల)పై దాడులకు పాల్పడుతూ భయానక వాతావరణం సృష్టించాయి.
Deer Killed | తిరువనంతపురం : కేరళ( Kerala )లోని త్రిస్సూర్‌లో కొత్తగా ప్రారంభించిన పుత్తూరు జూపార్కు( Puthur Zoological Park )లోకి వీధి కుక్కలు( Stray Dogs ) ప్రవేశించాయి. జూలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ జింకల( Deer )పై దాడులకు పాల్పడుతూ భయానక వాతావరణం సృష్టించాయి. ఈ కుక్కల దాడిలో 10 జింకలు ప్రాణాలు కోల్పోయాయి. నెల రోజుల క్రితం ప్రారంభించిన ఈ జూపార్కులో భద్రతా లోపం వల్లే వీధి కుక్కలు ప్రవేశించాయని జంతు ప్రేమికులు ఆరోపించారు.
ఈ ఘటనపై వన్యప్రాణి నిపుణుడు డాక్టర్ అరుణ్ జచరియా స్పందించారు. మంగళవారం జూపార్కు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. అయితే జింకల మృతికి స్పష్టమైన కారణం పోస్టుమార్టం తర్వాతే తెలుస్తుందన్నారు. ఈ ఘటనపై స్పందించేందుకు జూ డైరెక్టర్ నాగరాజు నిరాకరించాడు.
ప్రస్తుతం పుత్తూరు జూపార్కులోకి స్కూల్, కాలేజీ విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. సాధారణ ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఇక 336 ఎకరాల్లో నిర్మించిన ఈ జూపార్కు.. ఆసియాలోనే రెండో అతిపెద్ద జూ పార్కు కాగా, ఇండియాలో మొదటిది. కేరళ సీఎం విజయన్ అక్టోబర్ 28న జూపార్కును ప్రారంభించారు. 80 జాతులకు చెందిన 534 జంతువులు ఈ జూలో ఉన్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram