Road Accident | ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్‌లోని ద్రామంద్‌గంజ్ ఏరియాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో.. పలు వాహనాలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 11 మంది సజీవదహనం అయ్యారు.
ద్రామంద్‌గంజ్ ఏరియా నుంచి లసోడాకు వెళ్తున్న ఓ ట్రక్కు బ్రేకులు అకస్మాత్తుగా ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆ వాహనం అదుపుతప్పి ముందు వెళ్తున్న కంటెయినర్‌తో పాటు మరో ట్రక్కును ఢీకొట్టింది. కంటెయినర్ ముందున్న బొలెరోను బలంగా ఢీకొట్టింది. దీంతో బొలెరో వాహనంలో మంటలు చెలరేగి 11 మంది సజీవదహనం అయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కిలోమీటర్ల మేర ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌ను పోలీసులు క్రమబద్దీకరించారు.
