Girl Delivers baby boy | ఓ 14 ఏళ్ల బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని పితోరఘర్ జిల్లాలో మంగళవారం వెలుగు చూసింది.
పితోరఘర్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు గతేడాది విడిపోయారు. అప్పట్నుంచి బాలిక ఒంటరిగానే ఉంటుంది. ఈ క్రమంలో ఓ యువకుడు ఆమెను లొంగదీసుకున్నాడు. పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది.
మంగళవారం బాలికకు పురిటి నొప్పులు రావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రసవం చేయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం బాలికతో పాటు శిశువును చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్న హోంకు తరలించారు.
బాలికను గర్భవతి చేసిన యువకుడిపై పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం యువకుడు పుణెలో పని చేస్తున్నట్లు తెలిసింది. ఇక బాధితురాలికి 18 ఏండ్లు నిండే వరకు స్టేట్ హోం సంరక్షణలోనే ఉండనుంది.
