Grape Farming | ఇంజినీరింగ్ మ‌ధ్య‌లోనే ఆపేసి.. ద్రాక్ష సాగుతో ఎక‌రాకు రూ. 15 ల‌క్షలు సంపాదిస్తున్నాడు..

Grape Farming | ఇటీవ‌లి కాలంలో చాలా మంది వ్య‌వ‌సాయం వైపు మ‌క్కువ చూపుతున్నారు. రెండు, మూడు ఎక‌రాల పొలం ఉన్న వారంతా కూర‌గాయ‌ల సాగు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. చాలా మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు పొలాల బాట ప‌డుతున్నారు. ఓ ఇంజినీరింగ్ కుర్రాడు కూడా త‌న ఇంజినీరింగ్ కోర్సును మ‌ధ్య‌లోనే ఆపేశాడు. ఇక త‌న తండ్రితో పాటు వ్య‌వ‌సాయ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యాడు. ద్రాక్ష సాగుతో ఎక‌రాకు రూ. 15 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు. మ‌రి యువ రైతు స‌క్సెస్ స్టోరీ అత‌ని మాట‌ల్లోనే విందాం..

నా పేరు కార్తీక్ గౌడ‌. బెంగ‌ళూరు రూర‌ల్ జిల్లాలోని హోస్కోటే తాలుకా ప‌రిధిలోని బ‌న‌హ‌ళ్లి గ్రామం మాది. నాన్న‌, మామ క‌లిసి ద్రాక్ష సాగు చేసేవారు. ఇంజినీరింగ్ చ‌దువుతున్న స‌మ‌యంలో 2017లో మా మామ చ‌నిపోయాడు. దీంతో నాన్న‌కు స‌హాయం చేయాల‌నే ఉద్దేశంతో 2017లోనే ఇంజినీరింగ్ రెండో సంవత్స‌ర‌మే చ‌దువు ఆపేశాను. ఇప్పుడు నా వ‌య‌సు 27 ఏండ్లు.

అయితే వ్య‌వ‌సాయంలోకి అడుగుపెట్టిన త‌ర్వాత లాభ‌సాటి సాగుపై దృష్టి సారించాను. ఈ క్ర‌మంలోనే ద్రాక్ష సాగులో ఉండే ప‌ద్ధ‌తుల‌ను తెలుసుకున్నాను. నాన్న‌, మామ బెంగ‌ళూరు బ్లూ, దిల్‌కుష్ వెరైటీల‌కు చెందిన ద్రాక్ష పండ్ల‌ను సాగు చేసేవారు. బెంగ‌ళూరు బ్లూ ద్రాక్ష సాగు అంతంత మాత్రంగా ఉండేది. ఇక బెంగ‌ళూరు బ్లూ ద్రాక్ష మొక్క‌ల‌ను మొత్తం తొల‌గించాను. దాని స్థానంలో కృష్ణ‌, శ‌ర‌ద్ అనే ద్రాక్ష ర‌కాల‌ను నాటాను. దిల్‌కుష్ అనే ద్రాక్ష ఆకుప‌చ్చ రంగులో ఉండి విత్త‌నాల‌తో కూడి ఉంటుంది. కృష్ణ‌, శ‌ర‌ద్ ర‌కాలు న‌లుపు రంగులో ఉండే విత్త‌నాలు లేని ర‌కాలు. ఈ ర‌కాలు ఒక్క‌సారి పంట‌కు వ‌స్తే.. దాదాపు 20 నుంచి 25 ఏండ్ల వ‌ర‌కు పంట‌ను ఇస్తూనే ఉంటాయి.

ఇక ద్రాక్ష సాగు కోసం 4 ఎక‌రాల నుంచి 6 ఎక‌రాల‌కు సాగు పెంచాను. కెమిక‌ల్స్ పూర్తిగా బంద్ చేసి సేంద్రియ ఎరువుల వైపు మొగ్గు చూపాను. సేంద్రీయ ఎరువుల‌ను వాడ‌డం వ‌ల్ల పంట దిగుబ‌డి ఎక్కువ‌గా వ‌చ్చింది. గ‌త ఏడేండ్ల‌లో 30 ట‌న్నుల ద్రాక్ష‌ను విక్ర‌యించాను. ఈ 30 ట‌న్నుల ద్రాక్ష కూడా దిల్‌కుష్ ర‌కానికి చెందిన‌ది. ఇక కృష్ణ‌, శ‌ర‌ద్ వెరైటీలు ప్ర‌తి సీజ‌న్‌లో ఎకరాకు 15ట‌న్నుల చొప్పున పండించాను. సాధార‌ణంగా ఎక‌రాకు 9 ట‌న్నులు మాత్ర‌మే పండిస్తారు.

దిల్‌కుష్ ద్రాక్ష‌ను కేజీ రూ. 50 చొప్పున విక్ర‌యించాను గ‌త సీజ‌న్‌లో. కృష్ణ ద్రాక్ష కిలో రూ. 100కు విక్ర‌యించాను. శ‌ర‌ద్ ర‌కం కేజీ రూ. 90. అంటే దిల్‌కుష్ ద్రాక్షను అమ్మి ఎక‌రా పంట‌కు రూ. 15 ల‌క్ష‌లు సంపాదించాను. 30 ట‌న్నులు అంటే 30 వేల కేజీలు. కేజీ రూ. 50 చొప్పున రూ. 15 ల‌క్ష‌లు సంపాదించాను. మ‌రో నాలుగు ఎక‌రాల్లో ప్ర‌తి ఏడాది జూన్ నుంచి జ‌న‌వ‌రి వ‌ర‌కు కూర‌గాయ‌లు పండిస్తున్నాం. సొర‌కాయ‌, పొట్ల‌కాయ‌, ట‌మాటో, వంకాయ వంటి కూర‌గాయ‌ల సాగు చేస్తున్నాం. దానిమ్మ తోట‌ను కూడా సాగు చేస్తున్నాం అని కార్తీక్ గౌడ పేర్కొన్నారు.