మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు ముగ్గురు జవాన్లు బలయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా చోటాబిటియా పోలీసు స్టేషన్ పరిధిలోమందుపాతర పేలి ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. రోడ్డుపై మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు(డీఆర్‌జీ) నిర్వీర్యం చేసే క్రమంలో ఒక్కసారిగా ఐఈడీ పేలుడు సంభవించింది. ముగ్గురు డీఆర్‌జీ జవాన్లు తీవ్రంగా గాయపడి.. అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరోకరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. మరణించిన వారిలో ఇన్‌స్పెక్టర్ సుఖ్రామ్ వట్టి, కానిస్టేబుల్స్ కృష్ణ కొమ్రా, సంజయ్ గధ్‌పాల్ ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఆపరేషన్ కగార్ పేరుతో ఏరివేసే కార్యక్రమంలో చత్తీస్ గఢ్ అడవులను జల్లెడ పట్టింది. ఈ నేపథ్యంలో కొంతమంది అగ్రనేతలు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.భారీ స్థాయులో లొంగుబాటులు జరిగియి. మార్చి 31తో ఆపరేషన్ కగార్ గడువు ముగిసిపోగా.. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31న ఛత్తీస్‌గఢ్‌ను మావోయిస్టు ముక్త్ రాష్ట్రంగా ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన మొదటి పేలుడు సంఘటన ఇదే కావడం గమనార్హం. దశాబ్దాల కాలంగా చత్తీస్ గఢ్ లోని బస్తర్ అడవుల్లో నక్సలైట్లు పెద్ద ఎత్తున మందుపాతరలను పాతిపెట్టారు. వారు అమర్చిన మందుపాతరలు భద్రతా బలగాలకు, స్థానిక ప్రజలకు సవాలుగా మారాయి. అటవీ ప్రాంతాల్లోని డొంకదారుల్లో బాంబులను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసే ప్రక్రియను భద్రతా దళాలు వేగవంతం చేశాయి. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
ప్రజాపాలన సభలో మైక్ ని నేలకేసి కొట్టిన కొత్త ప్రభాకర్ రెడ్డి
పాపం.. పుచ్చకాయ అమాయకురాలు.. ముంబై కుటుంబాన్ని చంపింది విష ప్రయోగం?
