Bhole Baba | ఫైవ్ స్టార్ హోట‌ల్‌ను త‌ల‌పించేలా 13 ఎక‌రాల్లో భోలే బాబా ఆశ్రమం.. ఆ భూమి విలువ రూ. 4 కోట్లు..!

Bhole Baba | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హ‌థ్రాస్‌లో నిర్వ‌హించిన స‌త్సంగ్ కార్య‌క్ర‌మంలో తొక్కిస‌లాట జ‌రిగి 121 మంది ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. మృతుల్లో అత్య‌ధికంగా మ‌హిళ‌లు, చిన్నారులే ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌పై సీరియ‌స్‌గా స్పందించిన అధికారులు.. భోలే బాబా ఆశ్ర‌మంలో త‌నిఖీలు నిర్వ‌హించారు.

త‌నిఖీల్లో భోలే బాబా ఆశ్ర‌మం 13 ఎక‌రాల్లో ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ భూమి విలువ రూ. 4 కోట్లు ఉంటుంద‌ని నిర్ధారించారు. అయితే ఆశ్ర‌మం మొత్తం ఫైవ్ స్టార్ హోట‌ల్‌ను త‌ల‌పించేలా ఉంద‌ని, ఆ విలాస‌వంత‌మైన సౌక‌ర్యాల‌ను చూసి షాకైన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. బాబా కోసం ప్ర‌త్యేకంగా ఆరు గ‌దుల‌ను కేటాయించిన‌ట్లు వెల్ల‌డైంది. మ‌రో ఆరు గ‌దులు క‌మిటీ మెంబ‌ర్లు, వాలంటీర్ల కోసం ఏర్పాటు చేసిన‌ట్లు తేలింది. మొత్తానికి భోలే బాబా భ‌క్తి ముసుగులో అపార‌మైన సంప‌ద‌ను కూడ‌బెట్టిన‌ట్లు అధికారుల ద‌ర్యాప్తులో తేలింది.

ఇక ఆశ్ర‌మంలో భోలే బాబా ఉండే గ‌దుల వ‌ద్ద‌కు వెళ్లేందుకు ప్ర‌త్యేక‌మైన మార్గాలు ఏర్పాటు చేశారు. అత్యాధునిక వ‌స‌తుల‌తో కూడా భోజ‌న‌శాల కూడా ఉంది. ఈ భూమిని ఆశ్ర‌మం కోసం త‌న‌కు బ‌హుమ‌తిగా ఇచ్చిన‌ట్లు గ‌తంలో భోలే బాబా పేర్కొన్నాడు. ఆశ్ర‌మంలో ప‌లు కీల‌క డాక్యుమెంట్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని ఇత‌ర ప్రాంతాల్లో కూడా బాబాకు ఆశ్ర‌మాలు ఉన్నాయి. వీటి విలువ రూ. కోట్ల‌లో ఉంటుంద‌ని పోలీసులు అంచ‌నా వేశారు.